పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? కారణాలు ఇవి కూడా కావచ్చు

ఋతుక్రమం ఒక సహాజమైన ప్రక్రియ.ఇది సహజంగా, సమయానికి వస్తేనే స్త్రీ ఆరోగ్యంగా ఉన్నట్లు.

కొందరు మహిళలు గర్భం లేకున్నా ఆలస్యంగా వచ్చే పీరియడ్స్ తో ఇబ్బందిపడుతూ ఉంటారు.తమకేదో అయిపోయిందని టెన్షన్ పడిపోతుంటారు.

ఆలస్యం జరిగితే ఎందుకు జరిగింది? కారణాలు తెలిస్తేనే కదా, డాక్టర్ని కలిసి సమస్య పూర్తిగా వివరించగలిగేది.కాబట్టి, పిరియడ్స్ లో ఆలస్యం జరగడం వెనుక బయటికి పెద్దగా తెలియని కారణాలేంటో చూద్దాం.

* వ్యాయామం అతిగా చేసే మహిళలకి పీరియడ్స్ ఆలస్యంగా రావడం కాని, అసలు రాకపోవడం కాని జరగొచ్చు.అతి వ్యాయామం వలన పెరిగే టెస్టోస్టిరోన్ లెవెల్స్ దీనికి కారణం.

Advertisement

హార్మోన్స్ లో ఇలా బ్యాలెన్స్‌ లోపించడం మంచిది కాదు.* గర్భనిరోధక మాత్రాలు ఎక్కువగా వాడినా ఇబ్బందే.

ఇలాంటి మందులు కూడా హార్మోన్‌ల విడుదలలో తీవ్రమైన మార్పుకి కారణమవుతాయి.అందుకే పిరియడ్స్ టైమ్ తప్పుతాయి.

* BMI లెవల్స్ పడిపోయినా ఋతుక్రమంలో ఆలస్యం జరుగుతుంది.* సడెన్ గా బరువు తగ్గితే, ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి.

స్త్రీ శరీరంలో అతిముఖ్యమైన హార్మోన్ ఇబ్బందుల్లో పడిపోవడం వలన, ఆ ప్రభావం పీరియడ్స్ మీద కూడా పడుతుంది.* మెనోపాజ్ దగ్గరపడితే, సూచనప్రాయంగా కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

* మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగితే, అది హైపోథాలమస్ అనే గ్లాండ్ ని ఇబ్బందిపెడుతుంది.ఈ కారణంతో కూడా హార్మోన్ల విడుదలలో అవకతవకలు జరుగుతాయి.

Advertisement

పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ఇదో కారణం.* కొన్నిరకాల యాంటిబయాటిక్స్ మందులు అతిగా వాడినా, అవి హార్మోన్ల సమతుల్యాన్ని దెబ్బతీసి పీరియడ్స్ లో ఆలస్యానికి కారణమవుతాయి.

* పిల్లలకు పాలు పట్టే స్త్రీలలో కూడా పీరియడ్స్ ఆలస్యంగా రావొచ్చు.

తాజా వార్తలు