తెలుగు ప్రజలు ఉప్పు ఎక్కువ తింటున్నారట .. ప్రమాదమా?

మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం చూడండి.ఎవరికైనా ఏదైనా కోపం రావాల్సిన విషయంలో కోపం రాకపోతే ఓ డైలాగ్ కొడతారు మనవారు.

"ఉప్పు కారం తినట్లేదా" అని.ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువ తింటే కోపం, పౌరుషం ఎక్కువ ఉంటాయి.కాని నిజానికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది.

అంటే, గుండెకి ప్రమాదం.స్ట్రోక్ రావచ్చు.

కిడ్నీలకు కూడా ప్రమాదమే.కాబట్టి ఉప్పు తినాలి కాని, ఎక్కువ చెయొద్దు.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అందించిన సలహాలను బట్టి, రోజుకి 5 గ్రాముల ఉప్పు మాత్రమే మన శరీరంలో పడాలి, కాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జనాలు రోజుకి సగటున 9.45 గ్రాముల ఉప్పు తింటున్నారని ఒక సర్వెలో బయటపడింది.అంటే, తినాల్సిన ఉప్పుకి డబుల్ ఉప్పు తింటున్నాం అన్నమాట.

Advertisement

ఈ విషయంపై న్యూట్రిషన్ నిపుణులు వివేకానంద ఝా, మధురిమ చౌదరీ అవేదన వ్యక్తం చేసారు.కూరలో ఉప్పు ఎక్కువ వాడటం పక్కనపెడితే, పిండివంటకాలు, తొక్కలు ఎక్కువ తినటం వలన ఉప్పు శాతం ఎక్కువ ఒంట్లో పడుతోంది, కాబట్టి ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
Advertisement

తాజా వార్తలు