`రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డది అనేగా` అనేవారు లేకపోలేరు! మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి.లేకపోతే నాయకులకు ఇబ్బందులు తప్పవు! ఇప్పుడు ఏపీ మంత్రుల మాటలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.
హోదా కోసం తొలి నుంచీ పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించబోయిన మంత్రులు.సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టేస్తున్నారు.
తెలిసి చేస్తున్నారో.తెలియక చేస్తున్నారో తెలియదుగాని ఏపీ మంత్రులు చంద్రబాబును చిక్కుల్లో పడేస్తున్నారు.
`నువ్వు చేసి చూపించు` అని అనడంలో తమ చేతకాని తనం అంతర్లీనంగా దాగుందనే విషయం మరిచిన ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు.హోదాకు పవన్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి అయ్యన్న పాత్రుడు పవన్‌కు సలహా ఇచ్చారు.
`ఎన్నికల ప్రచార సమయంలో మోడీ పక్కనే కూర్చున్న పవన్.ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా విషయంపై ప్రధానితో మాట్లాడాలి` అని ఉచిత సలహా ఇచ్చారు.
దీనిపై పవన్ వెంటనే ఘాటుగా స్పందించారు.`నేను మోడీ గారితో ప్రచార సభల్లోనే కూర్చున్నాను కానీ.
మీ ఎంపీలందరూ ఆయనతో పార్లమెంటులోనే కూర్చుంటున్నారు కదా.వారేం చేస్తున్నారు.? మీడియా ముందుకొచ్చి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదని చెప్పడం తప్ప.ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి.
ప్రజల అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికి కూడా మీరు భయపడితే ఎలా.మీరు ఆపని చేయపోబట్టేకదా ఈ రోజు యువత రోడ్లమీదకు వస్తుంది.మీరూ ఏమీ చేయకండి.యువతనూ చేయనియ్యకండి.మరి దీనికి పరిష్కారమేంటి?` అని ప్రశ్నించారు.
ఈ విషయంలో ఏపీ మంత్రులు గ్రహించని విషయం ఏమిటంటే.
స్పెషల్ స్టేటస్ పై ఢిలీ వెళ్లి మోడీని కలవమని, సాధించమని పవన్ కు చెప్పడం వెనక…`మా వల్ల, మా చంద్రబాబు వల్లా కావడం లేదు` అని వారి చేతకాని తనాన్ని ఒప్పుకున్నట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇలా పవన్ ను ఢిల్లీ వెళ్లి మోడీతో మాట్లాడమంటూ… చంద్రబాబు శక్తిని, స్థాయిని ఏపీ మంత్రులు తగ్గించేస్తూ, బాబును ఇరుకున పెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.