మెగాస్టార్ చిరంజీవికి ఘోరమైన అవమానం

మెగాస్టార్ చిరంజీవి .ఆ పేరే ఒక బ్రాండ్.

మొదటిరోజు రికార్డులైనా, టాక్ వస్తే లైఫ్ టైమ్ రికార్డులైనా .

అన్ని బద్దలు అయిపోయేవి.ఆ ఏరియా ఈ ఏరిఉఅ అని తేడాలుండేవి కాదు.

మరీ ముఖ్యంగా నైజాం.తెలంగాణలో బాస్ క్రేజే వేరు.

దశబ్దాలు నైజాంని ఏలిన మెగాస్టార్ కి ఇప్పుడు నైజాంలోనే ఎదురుదెబ్బ తగిలింది.మొదట ఏసియన్ ఫిలిమ్స్ సంస్థ 20 కోట్లకు పైగా చెల్లించి ఖైదీ నం 150 హక్కులని చేజిక్కించుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసింది.

Advertisement

ఆ డీల్ అలాగే నిలవలేదు.ఏసియన్ మళ్ళీ 14 కోట్లకి సినిమాని అడుగుతున్నారని తెలుగుస్టాప్ ఇప్పటికే చెప్పింది.

తాజా సమాచారం ప్రకారం, డీల్ నుంచి పూర్తిగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయేలా ఉంది ఆ సంస్థ.మరో మాటలో చెప్పాలంటే, ఖైదీ నం 150 సినిమా బిజినెస్ నైజాంలో ఇంకా ఓపెన్ గానే ఉంది.

రామ్ చరణ్, చిరంజీవి అడుగుతున్న రెట్లు బయ్యర్లకి నచ్చట్లేదు.అందుకే ఎవరు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.

అయితే, ఏసియన్ మాత్రం చర్చలు జరుపుతోంది.ఇదే పద్ధతి కొనసాగి, కావాల్సిన రేటుకి బయ్యర్ దొరక్కపోతే, ఇక గీతా ఆర్ట్స్ సినిమాని విడుదల చేసుకుంటుందట.

ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?
Advertisement

తాజా వార్తలు