ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు తాజాగా షాకిచ్చింది.కస్టమర్ల కోసం గతంలో ప్రవేశపెట్టిన ప్రో, ప్రో ప్లస్ మెంబర్‌షిప్‌లను నిలిపివేసింది.
కంపెనీ తన గోల్డ్ స్కీమ్‌ను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత 2020లో తన జొమాటో ప్లస్, జొమాటో ప్రో ప్లస్ అనే మెంబర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది.వాటిని శాశ్వతంగా నిలిపివేస్తున్న జొమాటా ప్రకటించడంతో కస్టమర్లు హతాశులయ్యారు.
కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి తాము తమ ప్రోగ్రామ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తున్నట్లు జొమాటో పేర్కొంది.ప్రో, ప్రో ప్లస్ సభ్యత్వం కోసం మెంబర్‌షిప్‌లు ఇక అందుబాటులో లేవని గమనించాలని సూచించారు.
ఇదే విధమైన మరిన్ని ఆఫర్‌ల కోసంజోమాటో యాప్‌ను చూస్తూ ఉండాలని కోరింది.
ప్రస్తుత ప్లాన్‌లోని సబ్‌స్క్రైబర్‌లు వాటి గడువు ముగిసేంత వరకు వాటి ప్రయోజనాలు పొందనున్నట్లు జొమాటో స్పష్టత ఇచ్చింది.
జొమాటో ప్రొ మెంబర్‌షిప్ సభ్యులు ప్రీమియం రెస్టారెంట్‌లు, బార్‌లు, కేఫ్‌లు మొదలైన వాటికి ఫైన్ డైనింగ్ హాట్‌స్పాట్‌లతో సహా అదనపు ప్రయోజనాలను పొందారు.వారు ఇతర జొమాటో కస్టమర్లకు అందుబాటులో లేని ప్రత్యేకమైన డెలివరీ ఆఫర్‌లను కూడా పొందుతారు.
ఇతర సాధారణ వినియోగదారుల కంటే ప్రో సభ్యులకు 15-20 శాతం వేగంగా ఆహారం అందుతుంది.మెంబర్‌షిప్ ప్లాన్‌ను ప్రారంభించిన సమయంలో, జొమాటో మనీ బ్యాక్ గ్యారెంటీని కూడా ప్రకటించింది.
సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో జొమాటో ప్రొ సబ్‌స్క్రిప్షన్ ఫీజులో 2 రెట్లు ఆదా చేయకుంటే, సంవత్సరం చివరిలో తాము సబ్‌స్క్రిప్షన్ ఫీజును ఆటోమేటిక్‌గా రీఫండ్ చేస్తామమని కస్టమర్లకు హామీనిచ్చింది.దీంతో పెద్ద ఎత్తున కస్టమర్లు జొమాటో ప్రొ, జొమాటో ప్రొ ప్లస్ మెంబర్‌షిప్‌లను తీసుకున్నారు.
తాజా నిర్ణయంతో వారంతా కంగుతిన్నారు.