ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా 'బాలు సురాగానికి స్వరార్చన' కార్యక్రమం తో నివాళి అర్పించిన జీ తెలుగు

నాద శరీర తనుమనిషం శంకరం అంటే ఈశ్వరుడు నాద శరీరుడు అందుకే ఆ సర్వేశ్వరునికి మనం చేసేదే స్వరార్చన దానితో అందరికి కలిగేది ఆనందమే కాదు దానికి మించి బ్రహ్మానందం.

ఆ బ్రహ్మానందాన్ని మన అందరం అనుభవించేలా చేసిన వారిలో సుప్రతిష్ఠితులు, సినీ వినీలాకాశంలో ధ్రువతార శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అగ్రగణ్యుడు.

పదహారు భాషలో నలబై వేల పాటలకు పైగా పాడి అందరి ప్రశంసలు పొందిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా జీ తెలుగు బాలు సురాగానికి స్వరార్చన అనే కార్యక్రమం తో నివాళి అర్పించింది.ఈ ఆదివారం జూన్ 27 సాయంత్రం 5:00 గంటలకు ఆ కార్యక్రమం ప్రసారం కానుంది.పద్మ విభూషణ్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం సారస్వతషణ్ముఖుడు - ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినీ నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, స్టూడియో ఓనర్ గా, నటుడిగా ఆరు ముఖాలతో ప్రకాశించే షణ్ముఖుడు.

అలాంటి గాన గంధర్వుడికి నివాళు అర్పిస్తూ మన జీ తెలుగు ఈసారి కూడా అందరిని మైమరిపించే విధంగా టాలీవుడ్ లోనే అగ్రతాంబూలం అందుకున్న సంగీత విద్వాంసులైన ఎస్ పి శైలజ, ఎస్ పి చరణ్, మనో, సంగీత దర్శకుడు మణి శర్మ, ఆర్ పి పట్నాయక్, సింగర్ రేవంత్, శ్రీ రామ్ చంద్ర, సత్య యామిని, మరియు స రి గ మ ప లో పాల్గొన్న వారితో కలిసి చేసిన ఈ కార్యక్రమం అందరిని అలరించడానికి వస్తుంది.పదానికి పదనిసలు పలికించే ఆయన గాత్రం, పదానికి ప్రాణాలు పొసే ఆయన సంగీతం వినేవారికి ఒక వరం.ఆ రెండు పొదిగిన ఆయన పాటలను జీ తెలుగు కుటుంబం వారి డాన్స్ పెర్ఫార్మన్స్ తో మన ముందుకు రాబోతున్నారు.అంతేకాకుండా, సంగీత దర్శకులు మణి శర్మ కు సత్కారం చేయగా, సంధ్య రాజు నాట్యం చేయగా, సింగర్ మనో మరియు జ్యోతి రెడ్డి మిధునం సినిమాను అందరి ముందుకు మరోసారి తీసుకురాగా, ఈ అదివారం సాయంత్రం అందరం కలిసి ఆ గాన గంధర్వుడుని మరో సారి తలచుకుందాం.

ఈ ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు మీ ముంగిళ్లలో బాలు సురాగానికి స్వరార్చన తో వస్తుంది జీ తెలుగు.తప్పక వీక్షించండి.

Advertisement

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

Advertisement

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

తాజా వార్తలు