పోలవరం పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.

రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరతామంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తెలుగు దేశం పార్టీ నాయకులు రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో ప్రజల్లో లేని పోని గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ నాయకులకు ఇదే నేను సవాలు విసురుతున్నాను.

పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో నాతో చర్చకు వస్తారా అంటూ మంత్రి అనీల్‌ సవాల్‌ చేశాడు.ఇంకా మంత్రి అనీల్‌ మాట్లాడుతూ దమ్ముంటే తెలుగు దేశం పార్టీ నాయకులు పోలవరం గురించి ఎక్కడైనా చర్చకు రండి.

రెండు సంవత్సరాల్లో పోలవరంను పూర్తి చేసి చూపుతాం.రెండేళ్లలో పోలవరంను పూర్తి చేస్తే అప్పుడు మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ సవాల్‌ విసిరాడు.

Advertisement

తెలుగు దేశం పార్టీలో ఎవరైనా ఈ సవాల్‌ను స్వీకరించగలరా అంటూ అనీల్‌ అన్నాడు.రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరంను పూర్తి చేసి ఏపీని సస్యశ్యామలం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని ఆయన అన్నాడు.

వైకాపా ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ఏపీ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని మంత్రి అన్నాడు.

Advertisement

తాజా వార్తలు