రివర్స్‌ టెండరింగ్‌లో అనుమానాలు

పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్దమయిన విషయం తెల్సిందే.

రివర్స్‌ టెండరింగ్‌లో కేవలం ఒకే ఒక్క సంస్థ మాత్రమే టెండర్‌వేయడం పట్ల తెలుగు దేశం పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వైకాపా ప్రభుత్వం టెండర్‌ల విషయంలో గోల్‌ మాల్‌ చేసింది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు దూళిపాల్ల నరేంద్ర విమర్శలు చేశారు.మేఘ సంస్థ ఒక్కటే ఎలా టెండర్‌ వేసిందో చెప్పాలని ప్రశ్నించాడు.

మేఘ సంస్థ వైకాపాకు సన్నిహిత సంస్థ అంటూ ఆయన విమర్శించారు.రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఏపీ ప్రజలపై దాదాపు రూ.1600 కోట్ల భారం పడబోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.వైకాపా ప్రభుత్వం దుర్బుద్దితో చేస్తున్న ఈ పని వల్ల పోలవరం పనులు మరింత ఆలస్యం అవుతాయని ఆయన అన్నాడు.

పలు ప్రాజెక్ట్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని, ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే తమ బతుకుల్లో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది తీవ్రమైన ఎదురు దెబ్బ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.జగన్‌ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో సాగుతుందని ఆయన అన్నాడు.

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

తాజా వార్తలు