జగన్ ధర్నా ఖరీదు ఎంత?

రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు చాలా ఖరీదుగా ఉంటాయా? బాగా ఖర్చు అవుతుందా? అంటే రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు కొన్ని నాసిరకంగా, మరికొన్ని విలువ గలవిగా ఉంటాయని అనుకోవాలి.

ఇది ఆయా నాయకుల స్థాయిని బట్టి ఉండవచ్చు.

ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు నిరసనగా జగన్ ఈ నెల 10న దిల్లీలో ధర్నా చేయాలనీ నిర్ణయించుకున్నారు.అదే ధర్నాలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను కూడా ఎండగట్టాలని అనుకున్నారు.

అయితే దిల్లీలో ధర్నా చేయడం చాలా ఖరీదైన కార్యక్రమం అని భావించారు.అందుకు చాలా డబ్బు కావాలట.

ధర్నా ఖర్చు ఎవరు పెట్టుకుంటారని జగన్ నాయకులను అడిగాడట.కాని ఎవ్వరు ముందుకు రాలేదు.

Advertisement

ఆ ఖర్చు భరించే శక్తి తమకు లేదని ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణకు ఉందని చెప్పారట.దీంతో బొత్స ఖర్చు మొత్తం తను పెట్టుకుంటానని ముందుకు వచ్చాడని సమాచారం.

వేదిక, వసతి, అందరికి ప్రయాణ ఖర్చులు, భోజన ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చాడు.రెండు స్పెషల్ ట్రైన్స్ బుక్ చేస్తున్నారు.

ఒకటి తిరుపతి నుంచి , మరొకటి అనకాపల్లి నుంచి దిల్లి బయలుదేరతాయి.ఈ దెబ్బతో జగన్కు బొత్స డార్లింగ్ అవుతాడేమో.

బొత్స ఎంత ఖర్చు పెడతాడో మరి.

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు