కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు( Dhanush ) ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.నాగార్జున, ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న కుబేర సినిమాపై( Kubera Movie ) భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాలలో ధనుష్ కొడుకు( Dhanush Son ) మంచి మార్కులు సాధించడం గమనార్హం.
12వ తరగతి బోర్డు పరీక్షలో ధనుష్ కొడుకుకు 600 మార్కులకు 569 మార్కులు వచ్చాయని సమాచారం అందుతోంది.ధనుష్ పెద్ద కొడుకు యాత్ర( Yatra ) సాధించిన మార్కులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
కెమిస్ట్రీలో 92 మార్కులు, బయాలజీలో 97 మార్కులు, ఫిజిక్స్ లో 91 మార్కులు, మ్యాథ్స్ లో 99 మార్కులు, తమిళంలో 98 మార్కులు, ఇంగ్లీష్ 92 మార్కులు సాధించి ధనుష్ కొడుకు వార్తల్లో నిలిచారు.
ధనుష్, ఐశ్వర్య రెండు సంవత్సరాల నుంచి విడిగా ఉన్నారనే సంగతి తెలిసిందే.కొన్ని నెలల క్రితం ధనుష్, ఐశ్వర్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.ధనుష్, ఐశ్వర్య( Aishwarya ) విడిపోయినా పిల్లల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా వ్యవహరిస్తున్నారు.
ధనుష్, ఐశ్వర్యల పెద్ద కొడుకు యాత్ర వయస్సు 18 సంవత్సరాలు కాగా చిన్న కొడుకు లింగా వయస్సు 14 సంవత్సరాలు కావడం గమనార్హం.
చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో యాత్ర, లింగా చదువుకుంటున్నారని సమాచారం అందుతోంది.పిలలు మంచి మార్కు సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.ధనుష్, ఐశ్వర్య కలకాలం కలిసే ఉండాలని అభిమానులు కోరుకుంటుండగా అలా జరగడం అసాధ్యమని తెలుస్తోంది.
ధనుష్ సైతం కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ధనుష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.