వీడియో: భారీ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి.. ఒక్కసారిగా కూలడంతో..?

అనుకోని ప్రమాదాలు చాలా మందిని బలి తీసుకుంటూ ఉంటాయి.ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నా వాటి నుంచి కొందరు ఎలాంటి గాయాలు లేకుండా బతికి బయటపడగలుగుతుంటారు.

 Video: A Person Sitting Under A Huge Tree.. Suddenly Fell Down, Cavite City, Phi-TeluguStop.com

దానిని ప్యూర్ లక్కుగా మనం అభివర్ణించవచ్చు.అయితే తాజాగా ఇలాంటి ఒక అదృష్టవంతుడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఫిలిప్పీన్స్‌( Philippines )లోని కావిటే సిటీకి చెందిన ఈ వ్యక్తి అద్భుతంగా ప్రమాదం తప్పించుకున్నారు.

Telugu Cavite, Escape-Latest News - Telugu

ఆయన తన ఇంటి బయట వరండాలో రిలాక్స్‌గా కూర్చొని ఉండగా, ఆయన వెనక ఉన్న భారీ వృక్షం పడిపోయింది.ఈ షాకింగ్ ఘటన సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యింది.వైరల్ హాగ్ దానిని ఆన్‌లైన్‌లో పంచుకుంది.

ఆ వీడియో షేర్ చేసిన కొంతసేపటికి వైరల్ అయ్యింది.చాలా మంది నెటిజన్లు ఆ వ్యక్తి ఎలా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూసి ఆశ్చర్యపోయారు.

వీడియో కేవలం 56 సెకన్లు మాత్రమే ఉంటుంది కానీ చాలా భయానకంగా సాగింది.ఆ వ్యక్తి సౌకర్యంగా కూర్చొని ఉన్నప్పుడు, ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇవ్వకుండా వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది.

అది అతడి తల మీద పడలేదు.తలకు ఇరువైపులాహం పడింది.

దాంతో సదరు యువకుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు.ఇంత పెద్ద చెట్టు తనకు కొన్ని అంగుళాల దూరంలో పడిన అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం.

Telugu Cavite, Escape-Latest News - Telugu

వీడియో పోస్ట్ చేసిన తర్వాత, ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసింది.చాలా మంది దానిపై వ్యాఖ్యానించారు, వారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి “దేవుడు ఎప్పుడూ మంచివాడే” అని అన్నారు.మరొకరు “సరైన స్థలం, తప్పుడు సమయం అని గ్రీకులో ఉంది, అంటే అదృష్టం కలిసి వచ్చింది కానీ సమయం మాత్రం చెడ్డది అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను చూడాలంటే ఈ లింకు https://youtu.be/QBc5kstQgtM?si=XbkE_6QYQ1EyqGnKపై క్లిక్ చేయండి.దీనికంటే ముందు ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

ఒక రీసెంట్ వీడియోలో మోటార్ బైక్ రేసర్ ట్రక్కు, కారు క్రాష్ నుంచి వెంట్రుక వాసిలో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube