నగదు బదిలీ పథకంపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ( Election Commission ) మరోసారి లేఖ రాసింది.ఈ క్రమంలో ఇవాళే నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందని ఎన్నికల కమిషన్ లేఖలో ప్రశ్నించింది.
జనవరిలో పథకాలకు ఇప్పటివరకు నగదు ఇవ్వని మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ఈసీ ప్రశ్నించింది.ఇందులో భాగంగా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పాలని ఈడీ డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.అయితే సంక్షేమ పథకాల( Welfare schemes ) లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.