ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు స్వల్ప ఊరట లభించింది.లిక్కర్ స్కాం కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు( Supreme Court ) జూన్ ఒకటోవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ పిటిషన్ పై ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
కాగా గత విచారణలో భాగంగా ఎన్నికల ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని న్యాయస్థానం చెప్పిన విషయం తెలిసిందే.కాగా లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్( ED arrested ) చేసింది.