ఏపీలో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం ప్రారంభం

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో వైఎస్ఆర్ యంత్రసేవా పథకం రెండో మెగా మేళా ప్రారంభమైంది.

ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో ట్రాకర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు.13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయడంతో పాటు రైతన్నల గ్రూప్ ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీని జగన్ జమ చేశారు.అనంతరం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందన్న ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామన్నారు.ప్రతి ఆర్బీకే సెంటర్ లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని తెలిపారు.అదేవిధంగా ఆర్బీకే పరిధిలో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు.

ఈ మేరకు రైతులు యంత్రసేవా యాప్ లో వాహనం బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

నాగచైతన్య శోభిత పెళ్లి అప్పుడేనా.. పెళ్లికి సంబంధించిన తీపికబురు అప్పుడే చెబుతారా?
Advertisement

తాజా వార్తలు