కళ కళలాడుతున్న వైసీపీ ... పీకేనే కారణమా ..?

ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఇక పనైపోయింది అన్నట్టు ఉండేది.నేతలు ఎవరికీ వారు యమునా తీరు అన్నట్టు ఎన్నో అసంతృప్తులతో.

అలకలతో ఉండేవారు.అధినేత జగన్ కి కూడా ఎప్పుడు ఏమి చెయ్యాలో అనే సరైన డైరెక్షన్ కూడా ఉండేది కాదు.

దీంతో అధికార పార్టీ టీడీపీ దూకుడుకి కళ్లెం వెయ్యలేక ఉసూరుమంటూ ఉండేది వైసీపీ.అయితే అదంతా ఒకప్పుడు.

ఇప్పుడు ఆ పార్టీ ప్రజల్లో క్రమ క్రమంగా మంచి మార్కులు పొందుతోంది.దీనంతటికి కారణం ఒకే ఒక్కడు అని ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

Advertisement

వైసీపీలో ఉన్న మైనెస్ లు అన్ని ఊడ్చేసి పార్టీని ఒక గాడిలో పెట్టాడు.ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, సూచనల వల్లనే పార్టీ ఈరోజు ఇంతగా ప్రజల్లోకి వెళ్లిందని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు.నాలుగేళ్లలో వైసీపీ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే, జగన్ తాను అనుకున్నట్లే ముందుకు వెళుతున్నారు.2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే జగన్ దృష్టంతా 2019 ఎన్నికలపై పెట్టారు.ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఆయన టార్గెట్ 2019 ఎన్నికలే.ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే జగన్ మీడియా సమావేశం పెట్టి ఓటమిని అంగీరిస్తున్నానని, ప్రజాసమస్యలపై పోరాడతానని చెప్పారు.

అప్పటి నుంచి నిత్యం జనంలోనే జగన్ ఉంటున్నారు.యువభేరి, దీక్షలు, ప్రజా సమస్యలపై ఆందోళనలతో ప్రజల్లో మమేఖం అవుతున్నాడు.ముఖ్యంగా ప్రత్యేక హోదా నినాదాన్ని నాలుగేళ్ల క్రితమే భుజానకెత్తుకున్న జగన్ అదే నినాదంతో అన్ని జిల్లాలను పర్యటించి వచ్చారు.

ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఎనిమిది రోజుల పాటు ఆమరణ దీక్షకు కూడా దిగారు.నాలుగేళ్లుగా జగన్ పడుతున్న కస్టాలు అన్ని ఇన్ని కాదు.ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

తనపై నమోదయిన కేసులు ఒకవైపు, పార్టీ నేతలు వరుసగా వెళ్లిపోవడంతో ఆయన ఒకదశలో కుంగిపోయారని పార్టీ నేతలు చెబుతారు.గత ఎన్నికల్లో స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారానికి దూరమైన జగన్ ఈసారి ఆతప్పు చేయదలచుకోలేదు.

Advertisement

అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు.పీకేని వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా నియమించిన తర్వాత జగన్ కు పార్టీలోనూ, క్షేత్రస్థాయిలోనూ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు బాగా తెలిసొచ్చాయి.

పార్టీలో ఉన్న నాయకులూ పార్టీని పట్టించుకోకుండా కేవలం పదవులకోసం మాత్రమే పాకులాడుతున్నట్టు జగన్ గ్రహించగలిగాడు.క్రమక్రమంగా పార్టీని గాడిలో పెట్టి ప్రజల్లో కూడా మంచి మార్కులు కొట్టేసేందుకు నిత్యం కృషి చేస్తున్నాడు.

ఇదంతా తెర వెనుక ఉంది పీకేనా చేయిస్తున్నట్టు బహిరంగంగా అందరికి తెలుసు.పీకే పెద్దగా బయటకు కనిపించకుండానే తన టీమ్ తో నిత్యం సర్వేలు చేయిస్తూ పార్టీ కి ఉన్న లోపాలు, యోజకవర్గాల్లో ఏమి జరుగుతుంద అనే రిపోర్టులు తాయారు చేసి ట్రీట్మెంట్ కూడా రెడీ చేస్తున్నాడు.

తాజా వార్తలు