'ఎన్నికల వ్యూహం'... జగన్ సరికొత్త నిర్ణయం..???

వైసిపి అధినేత చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకి ప్రజాదరణ వెల్లువలా వచ్చి పడుతోంది.రోజు రోజుకి జగన్ కి ప్రజలలో ఆదరణ పెరిగిపోవడం.

జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పట్టడం, టిడిపి పార్టీలో గుబులు రేపుతోంది.ఈ తరుణంలోనే వైసీపీ ను దెబ్బ కొట్టడానికి టిడిపి పార్టీ తమ నేతలతో వైసీపీ పై మాటల యుద్ధం చేయడం మొదలు పెట్టింది.

జగన్ కు సరైన వ్యూహాలు లేక సతమతమవుతున్నారు అంటూ ఎద్దేవా చేస్తోంది.అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.

జగన్ సరికొత్త వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని భవిష్యత్తులో వాటిని అమలు చేయడంతో జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలో మరింత ఆదరణ పొందటం ఖాయమని తెలుస్తోంది.అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుండటంతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జగన్ స్పీడ్ కు మరింత జోరు పెంచుతుంది.ఇదిలాఉంటే టీడీపీ మాత్రం జగన్ ఏం చేస్తారు, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తున్నారు, అంటూ కూపీ లాగే పనిలో ఉంటే.

Advertisement

జగన్ మాత్రం టీడీపీ గురించి ఆలోచించే ప్రయత్నం ఏ మాత్రం చేయడం లేదని తన వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు దూసుకుపోతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.అయితే ప్రజలు ఏపీలో మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అందుకే జగన్ కి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని పార్టీ వర్గాలు ఎంతో ఉశ్చాహంతో తెలుపుతున్నాయి.ఈ క్రమంలోనే జగన్ తనకి ప్రజలలో ఉన్న క్రేజ్ ని కొనసాగించడానికి ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని త్వరలో మరొక వ్యూహంతో సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది అదేంటంటే.

త్వరలో పాదయాత్ర ముగించుకుని జగన్ వెనువెంటనే బస్సు యాత్ర కు సిద్ధమవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా జగన్ ప్రజల్లోనే ఉండాలని, అదే వైసీపీ బలాన్ని ఇస్తుందని.అందుకు తగ్గట్టుగానే సంకల్ప యాత్ర అవ్వగానే బస్సు యాత్ర చేపట్టాలని పాదయాత్రలో కవర్ అవ్వని ప్రాంతాలను నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర తో కవర్ చేయాలని జగన్ యోచిస్తున్నట్లుగా చెప్తున్నారు పార్టీ నేతలు.ఇదిలాఉంటే వైసీపీ రచిస్తున్న వ్యుహాలు, జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు బ్రహ్మ రధం పట్టడం చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు గుండె 102 కొట్టుకోవడం ఖాయం అంటూ ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024

ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని బస్సు యాత్ర చేపట్టాలని అనుకుంటున్న జగన్ తాజా వ్యూహంతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు