తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు వైసీపీ అధినేత జగన్.తాను ఏ నిర్ణయం తీసుకున్నా, అది వెంటనే అమలు అవ్వాలి అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఎక్కడా ఏ విషయంలోనూ, రాజీ పడేందుకు జగన్ ఏ మాత్రం ఇష్టపడరు.ఆ విధంగానే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నా, తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లే క్రమంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.అయితే ఆ నిర్ణయాలు ప్రభుత్వానికి మేలు చేయకపోగా, కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ఉండడం జగన్ కు అంతుపట్టడం లేదు.2019 ఎన్నికల ఫలితాల తర్వాత అధికారం చేపట్టిన వైసిపి మొదట్లోనే ఇసుక విధానం పై సంచలన నిర్ణయం తీసుకున్నా, ఆకస్మాత్తుగా అంతకు ముందు ఉన్న ఇసుక పాలసీని రద్దు చేసింది.అయితే కొత్త ఇసుక పాలసీ తీసుకురావడం, చాలా నెలలు గా ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడం, నిర్మాణ రంగం కుదేలు అవ్వడం, ఇలా ఎన్నో జరిగిపోయాయి.దీంతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు తీసుకున్నారని వైసిపి ఆరోపణలు చేసినా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం వంటి వ్యవహారాలు కావలసినంత ప్రభుత్వానికి తీసుకువచ్చాయి.
ఇసుక పాలసీ విధానంలో కొత్త మార్గదర్శకాలను తీసుకురాకుండా ,హడావుడిగా పంతం పట్టి పాత పాలసీ రద్దు చేయడం, కొత్త పాలసీ అమలు చేసేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవడం వంటి కారణాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండడంతో పాటు, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందనే విషయం గుర్తించిన జగన్ తాజాగా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం లో ఇసుక పాలసీ పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రీచ్ నుంచి స్టాక్ పాయింట్ కు అక్కడి నుంచి ప్రజలకు రవాణా చేసే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
యూనిట్ ధర 475 రూపాయలకు మించకూడదని నిర్ణయించారు.ఈ విధంగా అయినా, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారానే ఇసుక పొందే అవకాశం ఉండగా, ఇకపై ఆఫ్ లైన్ లోనూ ఇసుక పొందే అవకాశం కల్పించాలని, మొత్తం వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోతే 13 జిల్లాలను 3 భాగాలుగా విభజించి టెండర్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తం గా ఇసుక పాలసీ వ్యవహారంలో ప్రజల్లో వ్యతిరేకత రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.