గొంతు సవరించుకున్న కొండన్న.. నష్టం జరిగి పోయింది

తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా ఎగసి పడిన కెరటం తరహాలో పరిస్థితి ఉంది.ఆ మధ్య ఇక అధికారం దక్కించుకోవడమే తరువాయి అన్నంతగా బీజేపీ హడావుడి సాగింది.

 Bjp Leader Konda Vishweshwar Reddy Comments Konda Vishweshwar Reddy ,  Brs Party-TeluguStop.com

బండి సంజయ్ మొదలుకుని జాతీయ నాయకత్వం హడావుడి చేసింది.తీరా చూస్తే పరిస్థితి తారు మారు అయ్యింది.

ఈ మధ్య కాలంలో బీజేపీ ని నమ్మే పరిస్థితి కనపడం లేదు.బీఆర్‌ఎస్ తో చీకటి ఒప్పందం ను బీజేపీ పెట్టుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయంలో నిజం ఎంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది అనుకుంటూ ఉండగా ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత కొండా విశ్వేశ్వరరెడ్డి( Konda Vishweshwar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్‌( MLC Kavitha ) లో అరెస్ట్‌ చేసి ఉంటే కచ్చితంగా బీజేపీ పై తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడేది.

కానీ కవిత అరెస్ట్ కాకపోవడం తో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తన అభిప్రాయం ను వ్యక్తం చేశాడు.ఆయన మాటలను బట్టి చూస్తే కచ్చితంగా ఆయన బీజేపీ పై అసంతృప్తి తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu Congress, Mlc Kavitha, Ts-Politics

ఇంతగా ఎందుకు బీజేపీ అంటూ అసంతృప్తి అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.ఈ సమయంలో ఆయన తన గొంతు సవరించుకుంటూ తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు.తాను నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు అన్నాడు.అలాగే తాను బీజేపీకి దూరం అయ్యి మళ్లీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టి పారేశాడు.

Telugu Congress, Mlc Kavitha, Ts-Politics

జరిగిన నష్టం ను కవర్‌ చేసుకునేందుకు కొండా విశ్వేశ్వరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ అధినాయక్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.ఆయన కాంగ్రెస్ పార్టీ( Congress )లో జాయిన్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఆయన మాత్రం బీజేపీ నుండి కదిలేది లేదు అంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube