వైసీపీ లో భారీ ప్రక్షాళన తప్పదా ? వారి పదవులకు ఎసరు ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) జీర్ణించుకోలేకపోతున్నారు.

అసలు ఈ స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎవరు అంచనా వేయలేకపోయారు.

ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఇంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది జగన్ కు  అంతుపట్టడం లేదు.వైసిపి ఓటమికి బాధ్యత ఎవరిది అనే విషయంలో ఇంకా పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది.

ముందుగా కొంతమంది అధికారుల కారణంగానే , ఈ ఫలితాలు వెలువడ్డాయని ,  ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి( Senior IAS Officer Dhanunjaya Reddy ) కారణంగానే పార్టీ ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని,  ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమంది వైసిపి నాయకులపైన, తమ అధినాయకుడు చేసిన తప్పులు కారణంగా ఈ వ్యవహారం చోటుచేసుకుందని కొంతమంది ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపి, పార్టీ నుంచి వలసలు ఎవరు వెళ్లకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు.ఇప్పటికే బెంగళూరుకు మకాం మార్చిన జగన్ పార్టీ ప్రక్షాళన పై పూర్తిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు జిల్లా కమిటీల నుంచి మండల కమిటీల వరకు మార్పు చేయాలని నిర్ణయించారు.

Advertisement

ఈ మేరకు నాయకుల పనితీరును పూర్తిగా సమీక్షించి కీలక నేతలను పక్కకు తప్పించి, చురుగ్గా పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకు వెళ్ళగల సమర్థులైన వారికి ఈ బాధ్యతలను అప్పగించాలని జగన్ నిర్ణయించుకున్నారట.

వైసీపీలో పదవులు అనుభవించిన వారిలో కీలక నేతలే ఉన్నా, వారు పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించడంలో వెనకబడడంతో,  దూకుడుగా ఉన్న నేతలకే పార్టీ పదవులు అప్పగిస్తే వైసిపి పుంజుకునే అవకాశం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారట.దీనిలో భాగంగానే పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు