గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ఎదురుగా దాదాపు రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఊహించని రీతిలో జనం రావటంతో.వైసీపీ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది.
వచ్చిన జనానికి గుంటూరు… విజయవాడ చుట్టుపక్కల జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ అయిపోయాయి.

ఇటువంటి తరుణంలో వైసీపీ అధినేత జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు… ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో… చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు… మీ జగన్ సెల్యూట్, మరోసారి అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేయడం జరిగింది. వైసీపీ ప్లీనరీ సమావేశం కావటంతో పార్టీలో నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.