యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది.
నెలరోజులపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సినిమా ఏకంగా 400 కోట్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా ఊహించని దానికన్నా విజయం అందుకోవడంతో కమల్ హాసన్ చిత్ర బృందానికి ప్రత్యేకమైన బహుమతులు అందించారు.
ఇకపోతే ఈ సినిమా థియేటర్లో చూడని ప్రేక్షకుల కోసం ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సినిమా అన్ని భాషల ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకుంది.ఇక ఈ సినిమా జులై 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే మరోసారి అభిమానులు ఈ సినిమాని డిజిటల్ స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే అమెరికాలో ఉండే అభిమానులకు మాత్రం ఈ సినిమా విషయంలో తీవ్ర నిరాశ ఎదురయింది.అమెరికాలో Hulu లో వస్తుందని ఆశించారు.ఎందుకంటే Hulu, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెంట్ పార్టనర్స్.
విక్రమ్ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.కానీ అమెరికాలో ఈ సినిమా ప్రసారం కాకపోవడానికి కారణం విక్రమ్ USA డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని తీసుకోవాలి.
ఈ విషయం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కన్ఫర్మ్ చేసి చెప్పింది.అందుకే ఈ సినిమా అమెరికాలో ప్రసారం కాలేదు.







