ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వంలోనూ అమలు కాని విధంగా నియోజకవర్గ, మండల స్థాయి పాలనను జగన్ ప్రజల ముందుకు తీసుకు వెళ్లిపోయారు.
ఇప్పుడు ప్రజలకు ఏం కావాల్సినా ఇంటికే వచ్చేస్తున్నాయి.ఈ పాలనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు దృష్టి సారిస్తున్నాయి.
జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.
తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ప్రజలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ పరువు తీసేసింది.
కడప జిల్లాలో కడప పట్టణంలో 15 వ వార్డు నుంచి వెళ్లేందుకు ప్రధాన రహదారి లేదు.ఇక్కడ ప్రజలు ఈ రోడ్డు వేయాలని ఎన్నోసార్లు మొత్తుకున్నారు.ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల వరకు ఎవ్వరూ వీరి గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు.దీంతో చివరకు విసిగిపోయిన వీరు 15 ఏళ్ల పోరాటం తర్వాత తమకు తామే రహదారిని నిర్మించుకున్నారు.

15వ వార్డు ప్రజలు ఇళ్లు ఇళ్లు తిరిగి దాతల సహకారంతో విరాళాలే సేకరించారు.అలా సేకరించగా వచ్చిన మొత్తం 2.10 లక్షలతో స్వయంగా కంకర రోడ్డు వేసుకోవడంతో పాటు ఆ రహదారి ప్రారంభంలో ఓ ఫ్లెక్సీ కట్టారు.జగనన్న పాలనలో ప్రజారోడ్డు అని ఫ్లెక్సీలో రాశారు.
ఏదేమైనా ప్రభుత్వ అధికారుల తీరు కారణంగానో, లేదా స్థానిక వైసీపీ నేతలో, ప్రజా ప్రతినిధుల వల్లే ఈ ఫ్లెక్సీ వల్ల సర్కారు పరువు పోయినట్లయ్యింది.ఈ ఫ్లెక్సీని ఇప్పుడు ప్రతిపక్షాలు మరింతగా వైరల్ చేస్తున్నాయి.
జగన్ సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్నివేల రహదారుల దుస్థితి ఇంకెలా ఉందో ? చెప్పక్కర్లేదని ప్రతిపక్షాలు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నాయి.జగన్ ఇకపై అయినా అభివృద్ధిపై ఓ కన్నేస్తే మంచిది.