ఏపీని జగన్ ఇలా విభజించబోతున్నాడా ?

ఏపీలో అప్పుడే అనేక సంస్కరణలు మొదలయిపోయాయి.ఏపీ మొత్తం పట్టు సాధించి వైఎస్సార్ మార్క్ పాలనను అందించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నాడు.

అందులో భాగంగానే పూర్తిగా తన మాట వినే నమ్మకమైన అధికారులను కీలక విభాగాల్లో నియమిస్తూ .గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికార్లను లూప్ లైన్ కి పంపించేస్తున్నారు.ఇక పరిపాలన సౌలభ్యం కొరకు ఏపీలో జిల్లాల విభజన చేయాలనే ప్రతిపాదన తెరమీదకు తెస్తున్నాడు.

ఇప్పటికే తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచుకుంది.ఆ విధంగానే ఇప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్యను పెంచోబోతున్నారు.

ప్రస్తుతం ఏపీలో ఉన్న13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తాను పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ చెప్పినట్లు కొత్త జిల్లాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు.పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన తప్పనిసరి అనేది జగన్ ఆలోచనట.ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని ప్రకటించిన జగన్ జిల్లాల పునర్విభజన ఫైలు పైనే త్వరలో ఆయన సంతకం చేయనున్నట్లు సమాచారం.

దీంతో ఇప్పుడు ఉన్న 13కి తోడు మరో 12 కొత్త జిల్లాలు కలిపి మొత్తం 25 జిల్లాలు కానున్నాయి.వీటిలో ఒక గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

అరకు జిల్లానా లేదా పార్వతీపురం కేంద్రంగానా అనేది తేలలేదు.అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు ఇవేనని ప్రచారం జరుగుతోంది.అరకు(విశాఖ జిల్లా), అనకాపల్లి(విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి(తూర్పు గోదావరి), నరసాపురం(పశ్చిమగోదావరి), విజయవాడ(కృష్ణా జిల్లా), నర్సరావుపేట(గుంటూరు జిల్లా), బాపట్ల(గుంటూరు జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), హిందూపురం(అనంతపురం జిల్లా), తిరుపతి(చిత్తూరు జిల్లా), రాజంపేట(కడప జిల్లా) .

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు