ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో ఉప్పెన హీరోయిన్.. కానీ..?

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరు అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే.

తనకు స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లిచ్చిన రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించే డైరెక్టర్ల జాబితాలో అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ, కొరటాల శివ లాంటి డైరెక్టర్లు కూడా ఉండగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.నిన్న విడుదలైన ఉప్పెన సినిమాలో నటించి అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన కృతిశెట్టి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సినిమాలో కృతిశెట్టి సెకండ్ హీరోయిన్ అని మెయిన్ హీరోయిన్ గా మరో స్టార్ హీరోయిన్ నటించనుందని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Advertisement

మరోవైపు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే, రష్మిక, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ మరి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కు జోడీగా ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు