మరో ఖరీదైన కారును కొనుగోలు చేసిన జూనియర్ ఎన్టీఆర్.. కొత్త కారు వెనుక సీక్రెట్ ఇదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గ్యారేజ్ లో ఇప్పటికే పదుల సంఖ్యలో కార్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

మార్కెట్ లోకి కొత్తగా ఏ కారు వచ్చినా కొనుగోలు చేయడానికి తారక్ ఎంతో ఇష్టపడతారు.

అయితే తారక్ మరో ఖరీదైన కారును( Expensive Car ) కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్ రాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తారక్ తాజాగా మెర్సిడెజ్ బెంజ్ కారు( Mercedes Benz )తో పాటు హ్యుందాయ్ ఈవీ కారును కొనుగోలు చేశారు.ఈ కార్లలో ఏ కారు కోసం తారక్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం దేవర సినిమా( Devara )తో బిజీగా ఉన్న తారక్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడంతో కార్యాలయం దగ్గర సందడి నెలకొంది.

Advertisement

వార్2 సినిమా( war 2 ) షూటింగ్ తో త్వరలో బిజీ కానున్న తారక్ ఆ సినిమా షూటింగ్ అవసరాల కోసమే కొత్త కారును కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.తారక్ నోరు మెదిపే వరకు వార్2 సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.వార్2 సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏజెంట్ రోల్( Agent Role ) లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

అయితే అధికారక ప్రకటన వస్తే మాత్రమే ఇలాంటి వార్తలను నమ్మాల్సి ఉంటుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ ట్రిపుల్ హ్యాట్రిక్ ను ఖాతాలో వేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.వార్2 మూవీ హిట్ గా నిలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తారక్ కు తిరుగుండదని చెప్పవచ్చు.ఎన్టీఆర్ లైనప్ వేరే లెవెల్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు