సాధారణంగా క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఎక్కువ నిడివితో విడుదలైనా తక్కువ నిడివితో విడుదలైనా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడతారు.అయితే టిల్లూ స్క్వేర్( Tillu Square ) మాత్రం కేవలం 2 గంటల 3 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలై కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
ఈ సినిమాకు ఇప్పటికే 14 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని ఇకపై ఈ సినిమాకు ఎంత మొత్తం కలెక్షన్లు వచ్చినా ఆ మొత్తం అదనపు లాభంగానే భావించాలని తెలుస్తోంది.అయితే టిల్లూ స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన శ్రీసత్య కూడా నటించారని ఆమె సన్నివేశాలను తీసేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలోని ఒక షాట్ లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లతో పాటు శ్రీసత్య కనిపించారు.శ్రీసత్య( Bigg Boss Sri Satya ) డైరెక్ట్ గా స్పందిస్తే మాత్రమే ఈ సినిమాలో ఆమె సీన్లు డిలేట్ చేశారో లేదో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
టిల్లూ స్క్వేర్ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్యకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.శ్రీసత్య బిగ్ బాస్ షోకు ముందు పలు వెబ్ సిరీస్ లలో నటించినా బిగ్ బాస్ షో తర్వాత మాత్రం వెబ్ సిరీస్( Webseries ) లకు దూరంగా ఉన్నారు.పలు టీవీ షోలలో మాత్రం ఆమె కనిపిస్తూ సందడి చేస్తున్నారు.శ్రీసత్య టాలెంట్ కు తగిన ఆఫర్లు రావడం లేదని నెటిజన్లు, ఆమె అభిమానులు చెబుతున్నారు.
శ్రీ సత్య పలు సీరియళ్లలో సైతం నటించి తన నటనతో మెప్పించారు.శ్రీసత్య భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.టిల్లూ స్క్వేర్ లో శ్రీసత్య నటించినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్( Screenshots ) నెట్టింట వైరల్ అవుతున్నాయి.టిల్లూ స్క్వేర్ ఫుల్ రన్ లో 70 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి.