ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు జనాలను అట్రాక్ట్ చేయడం కోసం కంటెంట్ కు ఏ మాత్రం సంబంధం లేని థంబ్ నెయిల్స్ పెడుతున్నాయి.టీజింగ్ హెడ్ లైన్స్ తో కాంట్రవర్సీలు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
చాలామంది సెలబ్రిటీలు వీటి విషయంలో రియాక్ట్ కాకపోయినా కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆ థంబ్ నెయిల్స్ పై స్పందిస్తూ ఫేక్ వార్తలను ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లను కడిగి పారేస్తున్నారు.
ఇదంతా ఎందుకు చెపుకోవాల్సి వస్తోందంటే గీతామాధురి భర్త నందు, స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది.
ఒక యూట్యూబ్ ఛానల్ టీజర్ లో రష్మీ, నందు మధ్య కెమిస్ట్రీ ఎక్కువగా ఉందని.దీంతో గీతామాధురి, నందు మధ్య గొడవ జరిగిందని వీడియో పోస్ట్ చేసింది.
తెలిసిన వాళ్ల ద్వారా ఈ యూట్యూబ్ వీడియో థంబ్ నెయిల్ గురించి నందుకు తెలియడంతో సోషల్ మీడియా వేదికగా నందు థంబ్ నెయిల్ గురించి స్పందించాడు.
నందు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “మీ బొందరా మీ బొంద.
గీతా ఇది చూశావా.? ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మనం గొడవ పడాలి అంట” అని కామెంట్ చేశాడు.గీతామాధురి వెంటనే “చూశాను బుజ్జి.కరోనాకు వ్యాక్సిన్ అయినా వస్తుందేమో కానీ ఈ థంబ్ నెయిల్ ఫెలోస్ మాత్రం ఛేంజ్ కారు” అని కామెంట్ చేశారు.ఈ పోస్ట్ గురించి స్టార్ యాంకర్ రష్మి కూడా “ఏంటో వీళ్ల బాధ” అంటూ థంబ్ నెయిల్స్ గురించి స్పందించింది.
నందు చేసిన కామెంట్ వల్ల యూట్యూబ్ థంబ్ నెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు ఇటీవల విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్ లో నందు పూరీజగన్నాథ్ వీరాభిమానిగా పోతురాజు క్యారెక్టర్ లో కనిపించగా రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది.టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాల్సి ఉంది.