రాజు గారితో  వైసీపీ యుద్ధం ? పార్లమెంట్ లో రచ్చ తప్పదా ?

సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా, రఘురామ కృష్ణంరాజు వ్యవహారమే పార్టీ సీరియస్ గా తీసుకుంది.

ప్రధాన ప్రతిపక్షం కంటే ఎక్కువగా తమను ఇరుకున పెడుతూ, నిత్యం అనేక సమస్యలను ఎత్తి చూపిస్తూ , తమ్ముని ఇబ్బంది పెడుతున్న రఘురామను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది వైసీపీకి అర్థం కావడం లేదు.కేంద్ర అధికార పార్టీ బిజెపిని ఉపయోగించుకుని వైసీపీ ని ఇరుకున పెడుతున్న తీరు ఆ పార్టీ అధినేత జగన్ కు ఏమాత్రం నచ్చడం లేదు.

ఇప్పటికి అనేకసార్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు ఫిర్యాదు చేసినా, స్వయంగా జగన్ వెళ్లి బిజెపి పెద్దలను కలిసి ఫిర్యాదు చేసినా, కేంద్రం మాత్రం ఆయన విషయంలో ఏమాత్రం స్పందించకపోవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.అనేక విషయాల్లో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నా, కేవలం ఒక్క విషయంలో తమకు ఎందుకు మేలు చేయడం లేదనే సందేహం వైసిపి పెద్దలను వెంటాడుతోంది.

అయితే త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉండడంతో అక్కడే రఘురామ వ్యవహారాన్ని తేల్చుకోవాలని వైసిపి సిద్ధమవుతోంది.తాజాగా తాడేపల్లి లో జగన్ వైసీపీ ఎంపీల తో భేటీ అయ్యారు.

Advertisement

ఈ సమావేశానికి రఘురామకు మాత్రమే ఆహ్వానం అందలేదు.అయితే ఈ సందర్భంగా పార్లమెంటులో ఏ విషయాలపై మాట్లాడాలి అనే విషయాలపై చర్చించారు.

ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంటులో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ సందర్భంగా రఘురామ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించాలని, అవసరమైతే ఈ విషయం బీజేపీతో విభేదించి పార్లమెంట్ లో ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉండాలనే విధంగా జగన్ సూచించినట్లు తెలుస్తోంది.వాస్తవంగా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి బిజెపి వైసిపి మధ్య పరోక్షమైన పొత్తు కొనసాగుతోంది.ఏపీ కి సంబంధించి ఎన్నో సమస్యలు పెండింగ్ లో  ఉన్నా, కేంద్రాన్ని విమర్శించేందుకు జగన్ ఇష్టపడడం లేదు.

బిజెపి కి ప్రధాన మద్దతు దారుడిగా వ్యవహరిస్తున్నారు.అయినా ఏపీలో అభాసుపాలు అవుతున్నాము అని గుర్తించిన జగన్ ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని, ఏదో రకంగా రఘురామ పై అనర్హత వేటు వేసే విధంగా ఎంపీలంతా పార్లమెంట్ లో పట్టుబట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తావిస్తూనే వస్తున్నారు.దీంతో రఘురామ వైసిపి మధ్య పార్లమెంట్ సాక్షిగా రచ్చ తప్పదు అనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు