YCP, TDP : ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ బలం ఎంత.. ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చంటే?

ఏపీ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ, వైసీపీ( YCP TDP ) నేతలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు.ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఉత్తరాంధ్రలో( Uttarandhra ) వైసీపీ, టీడీపీలలో ఏ పార్టీ బలం ఎంత అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ టీడీపీకి వైసీపీకి విజయావకాశాలు సమానంగా ఉన్నాయని తెలుస్తోంది.

నరసన్నపేట, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, పాతపట్నంలో వైసీపీ బలంగా ఉందని సమాచారం అందుతోంది.టెక్కలి, ఆముదాల వలస, రాజాం, పాలకొండ, ఎచ్చెర్లలలో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

వైసీపీ, టీడీపీలలో ఏ పార్టీ ఎక్కువ కష్టపడితే ఆ పార్టీకి ఒకింత ఎక్కువ మొత్తం సీట్లు సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

Advertisement

విజయనగరం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.కొన్నిచోట్ల టీడీపీ నేతల అసమ్మతి( Disagreement of TDP leaders ) రాజకీయాల వల్ల విజయనగరంలో దాదాపుగా అన్ని స్థానాలలో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది.చీపురుపల్లి, సాలూరు, కురుపాం, పార్వతీపురం బొబ్బిలి, ఎస్.కోటలలో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

విశాఖ సిటీలో పరిశీలిస్తే విశాఖ నార్త్, విశాఖ సౌత్ ( Visakha North, Visakha South )లో వైసీపీకి తిరుగులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, ఇతర నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉండనుందని తెలుస్తోంది.ఉత్తరాంధ్రలో వైసీపీకే ఎడ్జ్ ఉండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

ఉత్తరాంధ్రలో టీడీపీతో పోల్చి చూస్తే వైసీపీకే ఒకటి రెండు సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.టీడీపీ జనసేన బీజేపీ కూటమికి గట్టిగా పోటీ ఇవ్వడానికి వైసీపీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు