అప్పుడే తాము మంత్రి పదవుల్లో కొలువు తీరి రెండు సంవత్సరాలు అయిపోయిందా అనే అభిప్రాయం వైసీపీ మంత్రుల్లో కలుగుతోంది.ప్రస్తుతం మంత్రివర్గ ప్రక్షాళన చేయడంతో పాటు, దాదాపు 90 శాతం మంత్రులను మార్చి కొత్త వారిని మంత్రులుగా ఏం చేయాలనే విషయంపై జగన్ దృష్టి పెట్టారు.
ఆ మేరకు ఎంపిక ప్రక్రియను పూర్తిచేసే బిజీలో ఉన్నారు.వాస్తవంగా మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న మొదట్లోనే పదవులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటాయని, ఆ తరువాత స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని ముందుగానే జగన్ క్లారిటీ గా చెప్పేశారు.
జగన్ చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ ఏర్పాట్లలో జగన్ నిమగ్నమయ్యారు.తమ మంత్రి పదవులు పోతాయని ఆందోళన ప్రస్తుతం మంత్రులు ఎక్కువగా కనిపిస్తోంది.
అసలు తాము మంత్రి పదవులను పూర్తిస్థాయిలో అనుభవించలేదు అని, తమ నియోజకవర్గాల్లోనూ కనీస అభివృద్ధి పనులు చేసుకోలేక పోయాము అని, కరోనా వైరస్ ప్రభావం తో ఈ ప్రక్రియకు బ్రేక్ పడిపోయిందని, ఇప్పుడు అంతా బాగుంటుంది అనుకుంటున్న సమయంలో తమ పదవులు పోయేలా ఉండడం తో ఎలా అయినా సరే మంత్రివర్గంలోనే కొనసాగేలా, అవసరమైతే మరో ఏడాది పాటు కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేసే నిర్ణయాన్ని జగన్ వాయిదా వేసుకునేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు.ఈ విషయాన్ని జగన్ కు సన్నిహితులైన సలహాదారుల ద్వారా చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కొత్తగా మంత్రివర్గంలో స్థానం సంపాదించేందుకు అప్పుడే యువ ఎమ్మెల్యేలు , జగన్ సన్నిహితులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.వీలైనంత తొందరగా జగన్ మంత్రివర్గాన్ని విస్తరిస్తే మంత్రి పదవులో కొలువు తీరవచ్చు అనే అభిప్రాయం వారిలో ఉండగా , మంత్రులు మాత్రం పదవీ కాలాన్ని పొడిగించే విషయంపై ఎక్కువ దృష్టి పెట్టారు.తమ ఆవేదనను జగన్ వద్దకు చేరవేసే వారి కోసం ఇప్పుడు గాలించే పనిలో ఉన్నారు.మరోవైపు జగన్ చూస్తే ఇప్పటివరకు మంత్రుల పనితీరు ఎలా ఉంది ? వారు పార్టీకి ప్రభుత్వానికి ఎంత వరకు ఉపయోగపడ్డారు ? ఎవరెవరిని మంత్రివర్గంలో ఉంచితే బాగుంటుంది ? ప్రస్తుతం తప్పించాలనే ఆలోచనలో ఉన్న మంత్రుల స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే ఎన్నో అంశాలపై దృష్టి సారించినట్లు గా కనిపిస్తున్నారు.