YCP Manifesto : ఈనెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం జరిగింది.మే 13న ఎన్నికలు జరగనుండగా.

జూన్ 4వ తారీఖు ఫలితాలు విడుదల కానున్నాయి.దీంతో ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి.

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) మిగతా పార్టీల కంటే చాలా స్పీడ్ మీద ఉంది.ఎన్నికల ప్రచారంలో ఇంకా పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన విషయంలో మిగతా పార్టీల కంటే వైసీపీ ముందంజలో ఉంది.

Ycp Manifesto : ఈనెల 20న వైసీపీ మేనిఫెస్�

సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule )ప్రకటించక ముందే వైయస్ జగన్ వైసీపీ తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈనెల 20వ తారీకు వైసీపీ మేనిఫెస్టో ( YCP Manifesto )ప్రకటించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి.ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలియజేయడం జరిగింది.ఇదే సమయంలో ప్రచారం ప్రారంభించేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు.2024 ఎన్నికలను వైసీపీ అధినేత వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికలలో అధికారం కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు.2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు.పలు కార్యక్రమాలలో తెలియజేస్తున్నారు.

Advertisement
YCP Manifesto : ఈనెల 20న వైసీపీ మేనిఫెస్�

తన పాలనలో జరిగిన మంచి బట్టి ఓటు వేయాలని కోరుతున్నారు.ఈ క్రమంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో మార్చి 20వ తారీకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని వైసీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు