రేపు చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పుంగనూరు పర్యటన రణరంగంగా మారింది.చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు ఇంకా పోలీసులకు మధ్య వాగ్వాదం జరగటంతో ఒక్కసారిగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.ఈ దాడులలో పోలీసుల వాహనం కూడా ధ్వంసమైంది.

చంద్రబాబు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది.ఇదిలా ఉంటే పుంగునూరు ఘటనపై( Pungunuru ) వైసీపీ మండిపడింది.

రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.తెలుగుదేశం పార్టీ హింసాత్మక వైఖరికి నిరసన అంటూ శనివారం చిత్తూరు జిల్లా బంద్ కి( Chittoor Bandh ) వైసీపీ పిలుపు ఇచ్చింది.

Advertisement

పుంగునూరులో హింసకు కారణం తెలుగుదేశం పార్టీ అని అధికార పార్టీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.పుంగునూరు ఘర్షణలకు సంబంధించి మొదటి ముద్దాయిగా చంద్రబాబుని చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో టీడీపీ నాయకులు వైసీపీపై మండిపడుతున్నారు.అధికార మదంతో వైసీపీ నాయకులే దాడులకు పాల్పడ్డారని.

సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి... సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?
Advertisement

తాజా వార్తలు