ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తో ఒక్కొక్కరుగా ఆ పార్టీ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో చాలా మంది బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు కూడా.
అయితే తాజాగా కామన్ వెల్త్ ఛాంపియన్ బబితా ఫోగట్ కూడా ఆ బీజేపీ లో చేరినట్లు తెలుస్తుంది.కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో బబితా తో పాటు ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది.మరో రెండు నెలల్లో హర్యానాలో ఎన్నికల జరగనున్న ఈ తరుణంలో ఫోగట్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం అనేది ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.2016 లో అమీర్ ఖాన్ మహావీర్ ఫోగట్ పాత్రలో అలరించిన దంగల్ చిత్రం తరువాత ఫోగట్ కుటుంబం మరింత పాపులర్ అయ్యింది.
అయితే ఒకరకంగా హర్యానా లో పాపులారిటీ ఉన్న ఆ కుటుంబం లోని ఇద్దరు వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరడం ఆ పార్టీ కి అనుకూలాంశంగా చెప్పొచ్చు.అయితే మోదీ చేపట్టిన విధానాలు, స్కీమ్లు తమను ఆకట్టుకున్నట్లు మహావీర్ పోగట్ చెప్పారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy