తీవ్రంగా గాయపడ్డ జాదవ్.... ప్రపంచ కప్ లో ఇండియా కు గట్టి దెబ్బే!

ప్రపంచ కప్ కోసం టీమ్ ని ఎన్నుకోవడం లో అటు కోచ్ రవిశాస్త్రి, ఇటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన వన్డే,టెస్ట్ మ్యాచ్ లలో ప్లేయర్స్ ను మారుస్తూ ఒక్కొక్కరిని పరీక్షిస్తూ మరీ టీమ్ ని ఫామ్ చేస్తున్నారు.

అయితే ఎంత జాగ్రత్త గా టీమ్ ని ఎన్నుకొని పక్కన పెట్టుకున్నారు.అయితే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లలో భాగంగా క్రికెటర్స్ అందరూ ఆడుతున్న సంగతి తెలిసిందే.

అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు.దీనితో ఇంగ్లాండ్,వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచ కప్ కు ముందు టీమిండియా కు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఒక బౌండరీ ని ఆపే క్రమంలో జాదవ్ తీవ్రంగా గాయపడం తో అతడిని మైదానం నుంచి తరలించినట్లు తెలుస్తుంది.దీనిపై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.

Advertisement

కేదార్కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించామని,రేపు అతనికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి అతడిని పూర్తి గా రెస్ట్ ఇస్తామని తెలిపారు.

ఎందుకంటే అతడు వరల్డ్ కప్ కు ఫిట్ గా ఉండడం ముఖ్యం.అతను కోలుకుంటాడని కోరుకుంటున్నా, అది అంత పెద్ద గాయంలా కనిపించడం లేదు.కానీ మంచి జరగాలనే కోరుకుంటున్నాం అని ఫ్లెమింగ్ తెలిపారు.

జాదవ్ గాయం కారణంగా టీమిండియా కష్టాల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకవేళ ప్రపంచ కప్ సమయానికి గనుక జాదవ్ కోలుకోలేకపోతే అతడి బదులుగా స్టాండ్ బే లో ఉన్న అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్ కు గానీ ఆడే అవకాశాలు ఉన్నాయి.

మరి ఈ ప్రపంచ కప్ లోపు జాదవ్ కోలుకుంటాడో లేదో చూడాలి.

మైక్ ఇస్తే చాలు.. స్టేజ్ పై చెత్త వాగుడు వాగుతున్న దర్శకులు
Advertisement

తాజా వార్తలు