గంభీరావుపేటలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గాంధీ స్కూల్ లో తల్లిపాల వారోత్సవాలు, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సూపర్వైజర్ పద్మజ మాట్లాడుతూ, బాలింతలు గర్భవతులకు, తల్లులకు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.

ప్రతి తల్లి పురిటి బిడ్డకు అందించే మొదటి పౌష్టికాహారం ముర్రుపాలే నని అన్నారు.తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల, తల్లికి బిడ్డకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టాలని, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని, తద్వారా బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనితెలిపారు.గర్భిణి బాలింతలు పిల్లలు సమతుల్య ఆహారం తీసుకుని రక్తహీనతని నివారించాలని, మండలంలోని 21గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలని నిర్వహించామని ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మజ తెలిపారు.

ఈ కార్యక్రమంలో, ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యురాల్లు శ్రీమతి, లత, ఏఎన్ఎంలు, రోజా ప్రమీల విజయ, శిరీషా, ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News