చలికాలంలో పాదాల పగుళ్లు చిరాకు పుట్టిస్తున్నాయా.. 2 రోజుల్లో రిపేర్ చేసుకోండిలా!

ప్రస్తుత ఈ చలికాలం( winter )లో ప్రధానంగా చిరాకు పుట్టించే సమస్యల్లో పాదాల పగుళ్లు ఒకటి.

వాతావరణం లో వచ్చే మార్పుల కారణంగా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.

కొందరికి పాదాల పగుళ్ల వల్ల నడపడానికి కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది.ఈ క్రమంలోనే పాదాల పగుళ్లను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

ఖరీదైన క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయినా సరే కొందరికి ఎలాంటి ఫలితం కనిపించదు.

దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.కానీ వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం రెండు రోజుల్లోనే పగిలిన పాదాలను రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు చేతి వేళ్ళతో బలంగా మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత అరగంట పాటు పాదాలను ఆరబెట్టుకోవాలి.అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోవాలి.

చివరిగా తడి లేకుండా పాదాలను తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా కనుక చేస్తే పాదాల పగుళ్ళు సమస్య దెబ్బకు పరార్ అవుతుంది.

పగుళ్లు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీ సూపర్ ఫాస్ట్ గా మీ పాదాలను రిపేర్ చేస్తుంది.మృదువుగా, కోమలంగా మారుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కాబట్టి పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు