`ప‌సుపు కాఫీ`తో ఇన్ని లాభాలా? అయితే రోజూ తాగాల్సిందే!

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ కాఫీని ఇష్టంగా ఇష్ట‌ప‌డి తాగుతుంటారు.పైగా మితంగా తీసుకుంటే కాఫీ వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు ఉండ‌వు.

అందుకే ఎలాంటి భ‌యాలు లేకుండా కాఫీని రెగ్యుల‌ర్‌గా డైట్‌లో చేర్చుకుంటారు.అయితే కొంద‌రు కాఫీలో ప‌సుపు క‌లిపి తీసుకుంటార‌ని మీకు తెలుసా? అవును, అదే ప‌సుపు కాఫీ.దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందొచ్చు.

మ‌రి లేటెందుకు ప‌సుపు కాఫీ ఎలా త‌యారు చేయాలి? అస‌లు ప‌సుపు కాఫీ తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా గిన్నెలో ఒక క‌ప్పు నీళ్లు, అర టీ స్పూన్ ప‌సుపు, దాంచిన చిన్న అల్లం ముక్క‌, చిటికెడు మిరియాల పొడి, రెండు స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్‌ వేసి బాగా మ‌రిగించాలి.ఇప్పుడు ఒక క‌ప్పు పాలు, ఒక టీ స్పూన్ కాఫీ పౌడ‌ర్ వేసుకుని హిట్ చేసి ఫిల్ట‌ర్ చేసుకుంటే ప‌సుపు కాఫీ సిద్ధ‌మైన‌ట్టే.ఈ కాఫీ ని రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు చ‌ప్పున తీసుకుంటే బ్ల‌డ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ క్ర‌మంగా క‌రిగిపోతుంది.

Advertisement

దాంతో గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ప‌సుపు కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.అందు వ‌ల్ల రోజూ ఈ కాఫీ తీసుకుంటే గ‌నుక ఒత్తిడి, డిప్రెష‌న్, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.మ‌తిమ‌రుపు స‌మ‌స్య ఉన్నా త‌గ్గు ముకం ప‌డుతుంది.

అలాగే ప‌సుపు కాఫీ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధక శ‌క్తి సైతం రెట్టింపు అవుతుంది.దాంతో త‌ర‌చూ జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటాయి.

బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికి ప‌సుపు కాఫీ గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.రోజూ ఒక క‌ప్పు ప‌సుపు కాఫీని సేవిస్తే గ‌నుక ఒంట్లో కొవ్వు సూప‌ర్ ఫాస్ట్‌గా క‌రుగుతుంది.మ‌హిళ‌లు నెలస‌రి స‌మ‌యంలో ఈ కాఫీని తీసుకుంటే నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అంతేకాదు, ప‌సుపు కాఫీ తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల పనితీరును మెరుగు ప‌డుతుంది.కండ‌రాలు బ‌లంగా మార‌తాయి.

Advertisement

మ‌రియు శ‌రీరం యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.

తాజా వార్తలు