రోజుకొక ప‌చ్చ అర‌టి తింటే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌..!

గ్రీన్‌ బనానా లేదా ప‌చ్చ అర‌టి.దక్షిణాదిలో వీటిని తిన‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు.

కానీ, ఇత‌ర దేశాల్లో మాత్రం ప‌చ్చ అర‌టిని తెగ ఆర‌గిస్తుంటారు.ప‌చ్చ అర‌టి రుచిగా ఉండ‌ట‌మే కాదు.

పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐర‌న్‌, విట‌మిన్ సి, విట‌మిన్ బి, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్రోటీన్ ఇలా బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌ను సైతం క‌లిగి ఉంటుంది.అలాగే ప‌చ్చ అర‌టి తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

మ‌రియు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌నూ నివారించుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి లేటెందుకు ప‌చ్చ అర‌టి ఎప్పుడు తినాలి.? అస‌లు ప‌చ్చ అర‌టి తిన‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.సాధార‌ణంగా డైట్ చేసే వారు బ‌రువు పెరిగిపోతామేమో అన్న భావ‌న‌తో.

ఇష్టం ఉన్నా అర‌టి పండును ఎవైడ్ చేస్తారు.కానీ, ప‌చ్చ అర‌టి తీసుకుంటే ఎటువంటి బ‌రువు పెర‌గ‌క పోగా.

త‌గ్గుతారు.అవును, రోజుకు ఒక అర‌టి పండు చ‌ప్పున తీసుకుంటే.

అందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్‌ వెయిట్ లాస్‌కు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.అలాగే రెగ్యుల‌ర్‌గా ఒక ప‌చ్చ అర‌టిని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య పరార్ అవ్వ‌డ‌మే కాదు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగు ప‌డుతుంది.దాంతో త‌ర‌చూ గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Advertisement

అధిక ర‌క్త పోటు బాధితుల‌కు ప‌చ్చ అర‌టి ఓ అద్భుత‌మైన వ‌రం అని చెప్పుకోవ‌చ్చు.

అవును, రోజూ ప‌చ్చ అర‌టి తింటే అందులో ఉండే పొటాషియం అధిక ర‌క్త పోటు స్థాయిల‌ను అదుపులోకి తెస్తుంది.అంతేకాదు, ప‌చ్చ అర‌టిని డైట్‌లో భాగంగా చేసుకుంటే.ఒత్తిడి, ఆందోళన, డిప్రెష‌న్‌, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మ‌రియు చ‌ర్మంపై ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, య‌వ్వ‌నంగా ఉంటుంది.అయితే గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే.

ప‌చ్చ అర‌టిని రోజుకు ఒక‌టికి మించి మాత్రం తీసుకోరాదు.

తాజా వార్తలు