మున‌గ పూల‌తో టీ.. రోజుకు ఒక క‌ప్పు తాగితే ఆ జ‌బ్బుల‌న్నీ పరార్‌!

దక్షిణ భార‌త‌దేశంలో మున‌గ చెట్టుకు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది.ఈ చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అయితే చాలా మంది ఈ చెట్టు నుంచి వ‌చ్చే మున‌క్కాయ‌లు, మున‌గాకు ను  మాత్ర‌మే వినియోగిస్తుంటారు.కానీ, మ‌న‌గ పూలు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి.

మున‌గ‌ చెట్టు పూలు తెల్లగా, గుత్తులు గుత్తులుగా పూస్తాయి.ఈ పువ్వుల్లో బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందువ‌ల్ల‌, వీటితో టీ త‌యారు చేసుకుని తీసుకుంటే వివిధ ర‌కాల జ‌బ్బులు ప‌రార్ అవుతాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మున‌గ పూల‌తో టీ ఎలా త‌యారు చేయాలి.? ఈ టీని ఏ స‌మ‌యంలో తీసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా గుప్పెడు మున‌గ పువ్వుల‌ను సేక‌రించి నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే.

అందులో మున‌గ పూలు వేసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఆ త‌ర్వాత టీని ఫిల్ట‌ర్ చేసుకుని.

రుచికి స‌రిప‌డా తేనెను క‌లిపి ఉద‌యాన్నే సేవించాలి.

ప్ర‌తి రోజు ఒక క‌ప్పు మున‌గ పూల టీని తీసుకోవ‌డం వ‌ల్ల.శ‌రీరంలో పేరుకుపోయిన అద‌న‌పు కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.అలాగే క‌డుపు అల్స‌ర్‌తో బాధ ప‌డే వారు ఈ టీని రోజూ తీసుకోవాలి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

త‌ద్వారా అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అల్స‌ర్‌ను క్ర‌మంగా త‌గ్గిస్తాయి.

Advertisement

మునగ పువ్వుల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.జ‌లుబు, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.మూత్రంలో మంట‌, ఇన్ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

అంతే కాదు, మున‌గ పూల టీను సేవించ‌డం వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి చేర‌కుండా ఉంటాయి.లైంగిక స‌మ‌స్య‌లు ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ సైతం బ‌లోపేతం అవుతుంది.

తాజా వార్తలు