కోక‌న‌ట్ టీ.. రోజుకో క‌ప్పు తాగితే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా?

కొబ్బ‌రి పాల‌తో త‌యారు చేసేదే కోక‌న‌ట్ టీ.ఈ కోక‌న‌ట్ టీ అద్భుత‌మైన రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది.

రోజుకు ఒక క‌ప్పు కోక‌న‌ట్ టీని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కోక‌న‌ట్ టీని ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు ఈ టీని తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క‌, చిటికెడు మిరియాల పొడి, రెండు దంచిన యాల‌కులు, ఒక‌టిన్న‌ర స్పూన్ టీ పౌడ‌ర్ వేసి ప‌ది నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌పై మ‌రిగించాలి.ఆ త‌ర్వాత కొబ్బ‌రి పాలు, రుచికి స‌రిప‌డా బ్రౌన్ షుగ‌ర్ వేసుకుని మ‌రో రెండు నిమిషాల పాటు మ‌రిగించి.

స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుంటే కోక‌న‌ట్ టీ సిద్ధం అవుతుంది.రుచిక‌ర‌మైన ఈ కోక‌న‌ట్ టీని రోజుకు ఒక క‌ప్పు చ‌ప్పున సేవించాలి.ఈ కోక‌న‌ట్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

Advertisement

జ్ఞాప‌క‌శ‌క్తి, ఆలోచ‌న శ‌క్తి.రెండు పెరుగుతాయి.

ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌దిలిపోతాయి.కోక‌న‌ట్ టీను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా, ప‌టుత్వంగా మార‌తాయి.

కొబ్బరి పాలలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.అవి కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి.అందువ‌ల్ల‌, కోక‌న‌ట్ టీని తీసుకుంటే గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

అంతేకాదు, కోక‌న‌ట్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

మ‌రియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

Advertisement

తాజా వార్తలు