వైరల్: గాలి కోసం విమానం డోర్ ఓపెన్ చేసిన మహిళ.... చివరకు!

మనిషికి ఏం లేకపోయినా కొంత సమయం జీవించగలడు కానీ గాలి లేకపోతే మాత్రం జీవించలేడు.

ఇంట్లో కానీ ప్రయాణ సమయంలో కానీ గాలి సరిగ్గా ఆడకపోతే తలుపులు లేదా కిటికీలు ఓపెన్ చేస్తూ ఉంటాం.

అయితే విమానంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు.అయితే ఒక మహిళ మాత్రం విమానంలో గాలి ఆడటం లేదని ఏకంగా ఎమర్జెన్సీ డోర్ నే ఓపెన్ చేసింది.

డోర్ ను ఓపెన్ చేసిన మహిళ అక్కడితో ఆగలేదు.అక్కడినుంచి విమానం రెక్కలపైకి వెళ్లింది.

అయితే ఆమె అదృష్టం కొద్దీ అదే సమయంలో విమానం ల్యాండ్ కావడంతో సరిపోయింది కానీ లేకపోతే మాత్రం ఈపాటికి ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.రన్ వేపై విమానం ల్యాండ్ అయిన వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆమెను ఎందుకు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశావని ప్రశ్నించారు.

Advertisement

సదరు మహిళ తనకు విమానంలో ఉక్క పోస్తోందని అందువల్లే డోర్ ఓపెన్ చేశానని చెప్పడంతో అవాక్కవ్వడం సిబ్బంది వంతయింది.ఆమె చేసిన పని నవ్వు తెప్పించేదే అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె చేసిన పనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.ఏదైనా పొరపాటు జరిగి ఉంటే విమానంలో ప్రయాణించే ప్రయాణికులందరి ప్రాణాలు ప్రమాదంలో పడేవి కాబట్టి అధికారులు మొదట ఆమె మానసిక స్థితిని తెలుసుకునే పనిలో పడ్డారు.

ఆమె కావాలనే డోర్ ఓపెన్ చేసినట్టు తేలితే మాత్రం ఎయిర్ పోర్ట్ నిబంధనల ప్రకారం ఆ మహిళకు శిక్ష పడుతుంది.ఉక్రెయిన్ లోని కైవ్ విమానశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ఆమె అలా వింతగా ప్రవర్తించడం గమనార్హం.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు