Woman Three Lions: ఆ మహిళ తెగువకి మగాడు కూడా పనికిరాడు.. 3 సింహాల వెనుక ధైర్యంగా నడుస్తోంది చూడండి!

సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియని మనుషులు వుండరు.ఎందుకంటే అంతలాగ అది నేటితరంపైన ప్రభావం చూపుతోంది.

దీనివల్లనే నేడు అనేక విషయాలు వెలికి వస్తున్నాయి.వీడియోల రూపంలో కంటెంట్ ఇందులో గుట్టగుట్టలుగా పడి ఉంటుంది.

అయితే వాటిలో ఏ కొన్నో వైరల్ అవుతుంటాయి.నెటిజన్లు వాటిని విపరీతంగా లైక్ చేస్తూ వుంటారు.

ఇక వైరల్ అయిన దాంట్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా వుంటాయి.ఇంకొన్ని వీడియోలు చూస్తే ఒళ్ళు గగుర్పొడిచేలాగా ఉంటాయి.

Advertisement

ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీకు ఒకింత ఆశ్చర్యం వేస్తుంది.ఎందుకంటే బేసిగ్గా ఒక సింహాన్ని చూస్తే ఎవ‌రికైనా ప్రాణం అరికాళ్ళలోకి జారిపోతుంది.

అటువంటింది ఏకంగా 3 సింహాలు ఎదురుప‌డితే ఎవరికైనా ఎలాగుంటుంది? అయితే ఇక్క‌డ గమ్మత్తేమిటంటే ఓ మ‌హిళ ఏకంగా 3 సింహాల వెంట న‌డిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది.ఈ వీడియోను డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్ జెన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా వెలుగు చూసింది.

ఇక వీడియోని ఒక్కసారి గమనిస్తే మూడు సింహాలతో క‌లిసి జెన్ న‌డిచివ‌స్తున్న వీడియోను మీరు గమనించవచ్చు.

ఆ సమయంలో ఆమెలో ఎలాంటి బెరుకు గాని, భయంగాని లేకపోవడం గమనించవచ్చు.కాగా ఈ వీడియోని ఇప్ప‌టివ‌ర‌కూ 70 ల‌క్ష‌ల‌కు పైగా చూడటం విశేషం.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

మూడు సింహాలు త‌మ‌తో ఆమెను న‌డిచేందుకు అనుమ‌తిస్తున్నాయంటే వాటికి ఆ మ‌హిళ చాలా ప్రత్యేకం అని అర్ధం అవుతోంది అని ఓ యూజ‌ర్ కామెంట్ చేయగా, ఈ సింహాలు ఎంత సౌమ్యంగా ఉన్నా ఏ క్ష‌ణం ఏం జరుగుతుందో చెప్ప‌లేమ‌ని, కాబట్టి ఆ మ‌హిళ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు.ఇంకొకరు ల‌య‌న్స్‌తో గేమ్స్ వద్దు అని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు