TDP : టికెట్ వస్తుందా లేదా ? ‘ తెలుగు తమ్ముళ్ల  ‘ టెన్షన్ 

ఆకస్మాత్తుగా తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి( Chandrababu naidu )తో పొత్తు పెట్టుకునేందుకు, దీనిపై సరైన క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు . కేంద్ర బిజెపి పెద్దలను కలిసి వారిని పొత్తుకు ఒప్పించి వారి కోరినన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించేందుకు సిద్ధమైపోవడం వంటివి టిడిపి నేతలు టెన్షన్ కలిగిస్తున్నాయి .

 Will The Ticket Come Or Not Tdp Leaders Tension-TeluguStop.com

టిడిపి జనసేన బిజెపి కలిస్తే అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయాలు ఉన్నా.ఈ పొత్తులో భాగంగా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అన్న టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది.

ఇప్పటికే జనసేన( Janasena )తో పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కేటాయించడం,  వాటికి సంబంధించిన నియోజకవర్గాల పేర్లు మీడియా , సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన టిడిపి టికెట్ ఆశిస్తున్న నేతలు ఆందోళన చెందుతున్నారు.ఇప్పుడు బిజెపితో పొత్తుల భాగంగా ఆ పార్టీకి ఏ స్థానాలను కేటాయిస్తారు ?  అందులో తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం ఉందా లేదా అనే విషయంలో వీరిలో కంగారు మొదలైంది.

Telugu Ap, Chnadra Babu, Delhi, Janasena, Telugudesham, Ysrcp-Politics

జనసేనకు పొత్తులో భాగంగా 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు,  మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.ఇప్పటికి దీనిపై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు.ఇక బిజెపి( BJP ) ఎన్ని సీట్లు కోరితే అన్ని సీట్లు కోరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధమైపోవడంతో,  తమ సీటు సంగతి ఏంటనే ఆందోళన టిడిపి టికెట్ ఆశిస్తున్న నేత్రలో కనిపిస్తోంది.

Telugu Ap, Chnadra Babu, Delhi, Janasena, Telugudesham, Ysrcp-Politics

ఇప్పటికే నియోజకవర్గంలో భారీగా సొమ్ము ఖర్చుపెట్టి,  ఈ ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని , ఇప్పుడు బిజెపి జనసేనలకు పొత్తులో భాగంగా తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గ ఉంటే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో కనిపిస్తోంది.చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని సీట్ల పై క్లారిటీ ఇస్తే గాని , ఈ నేతల్లో టెన్షన్ తగ్గేలా కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube