TDP : టికెట్ వస్తుందా లేదా ? ‘ తెలుగు తమ్ముళ్ల ‘ టెన్షన్
TeluguStop.com
ఆకస్మాత్తుగా తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి( Chandrababu Naidu )తో పొత్తు పెట్టుకునేందుకు, దీనిపై సరైన క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు .
కేంద్ర బిజెపి పెద్దలను కలిసి వారిని పొత్తుకు ఒప్పించి వారి కోరినన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించేందుకు సిద్ధమైపోవడం వంటివి టిడిపి నేతలు టెన్షన్ కలిగిస్తున్నాయి .
టిడిపి జనసేన బిజెపి కలిస్తే అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయాలు ఉన్నా.
ఈ పొత్తులో భాగంగా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అన్న టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది.
ఇప్పటికే జనసేన( Janasena )తో పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కేటాయించడం, వాటికి సంబంధించిన నియోజకవర్గాల పేర్లు మీడియా , సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన టిడిపి టికెట్ ఆశిస్తున్న నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు బిజెపితో పొత్తుల భాగంగా ఆ పార్టీకి ఏ స్థానాలను కేటాయిస్తారు ? అందులో తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం ఉందా లేదా అనే విషయంలో వీరిలో కంగారు మొదలైంది.
"""/" /
జనసేనకు పొత్తులో భాగంగా 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికి దీనిపై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు.ఇక బిజెపి( BJP ) ఎన్ని సీట్లు కోరితే అన్ని సీట్లు కోరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధమైపోవడంతో, తమ సీటు సంగతి ఏంటనే ఆందోళన టిడిపి టికెట్ ఆశిస్తున్న నేత్రలో కనిపిస్తోంది.
"""/" /
ఇప్పటికే నియోజకవర్గంలో భారీగా సొమ్ము ఖర్చుపెట్టి, ఈ ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని , ఇప్పుడు బిజెపి జనసేనలకు పొత్తులో భాగంగా తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గ ఉంటే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో కనిపిస్తోంది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని సీట్ల పై క్లారిటీ ఇస్తే గాని , ఈ నేతల్లో టెన్షన్ తగ్గేలా కనిపించడం లేదు.
యూదులతో బంధాలు బలోపేతం.. ప్రధాని మోడీపై భారతీయ అమెరికన్ ప్రశంసల వర్షం