టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్( Hero Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదిని మారుస్తూ మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.
అయితే ఎట్టకేలకు మార్చి ఎనిమిదో తేదీన ఈ సినిమా విడుదల అవుతుందని అందరూ అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తుండగా తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీన మరొకసారి వాయిదా వేశారు.
ఈ విషయంలో అభిమానులు నిరాశ పడే లోపే మరొక గుడ్ న్యూస్ చెప్పారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs of Godavari movie ) షూటింగ్ ఇంకా కొంచెం అలాగే ఉందని అందుకే ఆ సినిమా బదులుగా గామి సినిమాను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు.అదే తేదీకి వేరే సినిమాను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటిస్తూ ఒక పోస్ట్ ని కూడా షేర్ చేశారు.
ఇక గామి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు మూవీ మేకర్స్.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు.అందులో భాగంగానే హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సలార్ సినిమా( Salaar movie ) కలెక్షన్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్సేను మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉంటేనే కలెక్షన్లు వస్తున్నాయి అని అనగా వెంటనే రిపోర్టర్.సలార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా బ్రో అని ప్రశ్నించాడు.దీనికి విశ్వక్ సేన్ స్పందిస్తూ నాలుగేళ్ల క్రితం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాము అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఆ విశ్వక్సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.