కర్ణాటక స్ట్రాటజీ తెలంగాణ లో వర్కవుట్ అవుతుందా ? సునీల్ ఎత్తులు పనిచేసేనా ?

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్( Congress ) చాలానే వ్యూహాలు రచిస్తోంది.

బీఆర్ఎస్ , బిజెపి లపై పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే ఎన్నికల హామీలను ఇస్తున్నారు.

  అలాగే ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కొద్దిరోజుల పాటు తెలంగాణలో మకాం వేసి భారీ బహిరంగ సభలో నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు .ఏదో విధంగా తెలంగాణలో( Telangana ) అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.ఎన్నికల్లో విజయానికి డోఖా లేకుండా చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు .దీనిలో భాగంగానే  కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజీలను తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు .

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్  వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil kanugolu ) కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణ ఎన్నికలలోను అనుసరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.కర్ణాటక ఎన్నికల ప్రచారంతో పాటు,  అభ్యర్థుల ఎంపిక పైనా సర్వేలు బాగా పనిచేశాయి.దీంతో తెలంగాణ ఎన్నికల బాధ్యతలను చూస్తున్న సునీల్ కానుగోలు 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించక ముందే సునీల్ కానుగోలు టీం అభ్యర్థుల ఎంపిక పైనా,  నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు అంచనా వేసి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది.

Advertisement

హైదరాబాద్ గాంధీ భవన్( Hyderabad Gandhi Bhavan ) కి కాంగ్రెస్ సునీల్ కానుగోలు ఆధ్వర్యంలో 350 మంది సభ్యులతో కూడిన వార్ రూమ్ బెంగళూరు నుంచి వచ్చినట్లు సమాచారం.గాంధీభవన్ లోని ఇందిరా భవన్ వార్ రూమ్ ను సునీల్ కానుగోలు టీమ్ సందర్శించింది .తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ప్రచారాన్ని ఉదృతం చేసేందుకు నిర్ణయించింది.

ప్రతి బృందం ఒక్కో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తుంది.వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు,  ప్రభుత్వ పథకాల్లోని వైశాల్యాలను విమర్శించేందుకు మరో టీమ్ ను సిద్ధం చేస్తున్నారు.ఈ టీం లు అన్నీ సునీల్ కానుగోలు ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.

పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక కార్యాచరణను రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారు.కర్ణాటక ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలను అమలు చేశారో అదే వ్యూహాలను ఇక్కడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు .

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు