మనిషి అనుకుంటే సాధించనిది అంటూ ఏదీ లేదు.కానీ దానికోసం కష్టపడాలి కష్టాలను అనుభవించాలి, అవమానాలను ఎదుర్కోవాలి.
శ్రమించాలి సహనంగా ఉండాలి.ఎన్నో అవాంతరాలను దాటుకుని గట్టిగా నిలబడితేనే అనుకున్నది సాధించగలం.
అందుకే అనుభవం ఉన్నవారు ఎప్పుడూ ఒకే మాట చెబుతూ ఉంటారు.కష్టపడితే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుందని చెబుతూ ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది అలా కష్టపడి ఊహించని స్థాయిలో ఉన్నవారు చాలామంది.అలా నిత్యం ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

నేడు కూడా ఒక మహిళా సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె సాధించిన ఘనత ఏమిటి అన్న విషయాల్లోకి వెళితే.ఆమె మామా ఎర్త్ కో ఫౌండర్ గజల్ అలఘ్.( Ghazal Allagh ) హర్యానాలో జన్మించిన గజల్ అలఘ్ 2010లో పంజాబ్ యూనివర్శిటీ ( Punjab University )నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ, 2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్‌లో ఫిగరేటివ్ ఆర్ట్‌లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది.
అయితే నిజానికి 2008 నుంచి 2010 వరకు ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో కార్పొరేట్ ట్రైనర్‌గా( Corporate Trainer at NIIT Ltd ) పనిచేస్తూ కొందరికి సాఫ్ట్‌వేర్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ ను అందించింది.చదువు పూర్తయ్యి పెళ్లయిన తరువాత 2016లో తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి మామా ఎర్త్ ప్రారంభించింది.

మామా ఎర్త్ ( Mama Earth )ద్వారా గజల్ అలఘ్ చిన్న పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది.ఇందులో భాగంగానే రాష్ క్రీమ్‌లు, లోషన్లు, షాంపులు, మసాజ్ ఆయిల్‌లు, బాడీ వాష్‌లు, డైపర్ లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది.ఈ ఉత్పత్తులు అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకున్నాయి.గజల్ అలఘ్ ప్రస్తుతం మామా ఎర్త్ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.
ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా అవతరించింది.రూ.25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్ సంపద రూ.9,800 కోట్లకు పెరిగినట్లు సమాచారం.అయితే వీకెండ్ కార్పోరేట్ ట్రైనర్‌గా మొదట సంపాదించిన డబ్బు కేవలం 1,200 రూపాయలు మాత్రమే.ఆ డబ్బులతో మా అమ్మను షాపింగ్‌కి తీసుకెళ్ళడం ఎప్పటికి మరచిపోలేని ఒక అనుభూతి అని ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టులో రాసుకొచ్చింది.
నేడు ప్రముఖ వ్యాపారవేతలలో ఒకరిగా ఎదిగిన గజల్ అలఘ్ షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది.ఈమె మొత్తం ఆస్థి విలువ వంద కోట్లకు పై మాటే.







