హుజురాబాద్ ఉప ఎన్నికతో పార్టీల బలాబలాలు రుజువు కానున్నాయా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు ఇటు బీజేపీకి , టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీకి జీహెచ్ఏంసీ ఎన్నికలలో ఎంత మేర లాభం జరిగిందో అట్లాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలో లాభం జరిగే అవకాశం ఉంది.

  అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న సందర్భం ఉంది.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందినట్లయితే  రాష్ట్ర ప్రజలందరూ ఈ ఉప ఎన్నికపై దృష్టి పెడతారు కాబట్టి ఒక్క చోట గెలిస్తే మైలేజీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనేది పార్టీల అభిప్రాయంగా ఉంది.

అందుకే ఎవరి వ్యూహాల్ని వారు పకడ్భందీగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ దళిత బంధు పథకం ద్వారా ముందుకెళ్తుండగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీ విమర్శలే కేంద్రంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ గెలిస్తే బీజేపీ బలం ఎంత ఉంది అనేది,టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్ బలం ఎంతనేది, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ బలం ఎంతనేది బలాబలాలు ఋజువయ్యే అవకాశం ఉంది.ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ సమారాన్నే తలపించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తాజా వార్తలు