భార్యల వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న స్టార్ సెలబ్రిటీస్

జీవితంలో మంచి తోడు దొరకకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలనైనా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఒక్కోసారి అవి తమ చేతులు దాటి జీవితాలు ముంగించుకునేదాక కూడా దారితీస్తూ ఉంటాయి.

 Why These Tollywood Celebs Committed Suicide Due To Wives Uday Kiran Vijay Sai P-TeluguStop.com

అందుకే పెళ్లి అనే బంధం చాలా ముఖ్యమైనది.మన జీవితంలోకి వచ్చేవారు మనల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది.

భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ ఒకరినొకరు గౌరవం గౌరవించుకోవాలి.వారి వారి అభిప్రాయాలకు విలువను ఇచ్చుకోవాలి.

లేదంటే ఆ బంధం ముందుకు సాగడానికి అవకాశమే ఉండదు.మనం ఇప్పుడు చూడబోయే టాలీవుడ్ స్టార్ జీవితాలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

పెళ్లి చేసుకున్న భార్య వల్ల తమ జీవితంలో సమస్యలు తప్ప సంసారం సాఫీగా సాగకపోవడంతో కన్నుమూయాల్సిన పరిస్థితి వచ్చింది.అలా భార్య బాధితులుగా మిగిలిపోయిన ఆ టాలీవుడ్ స్టార్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విజయ్ సాయి

టాలీవుడ్ లో కమీడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు విజయ్ సాయి. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నప్పటికీ అవకాశాలు తగ్గడంతోనే విజయ్ జీవితంలో కష్టాలు కూడా మొదలయ్యాయి.

తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య విజయ్ ని తక్కువగా చూడడంతో తట్టుకోలేకపోయాడు.కనీసం కూతురితో కూడా ప్రేమగా ఉండలేకపోయాడు.తద్వారా జీవితాన్ని ముగించేసుకొని తన అభిమానులకు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు.

కునాల్ సింగ్

Telugu Vijay Sai, Heroes, Kunalsingh, Pavani, Pradeep Kumar, Tollywood, Uday Kir

ప్రేమికుల రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన కునాల్ ముంబైకి చెందినవాడు.హిందీలో పలు సినిమాల్లో నటించగా తన కెరియర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు.కానీ జనాల మదిలో మాత్రం అతడు ఎప్పటికీ ఒక హీరోగా మిగిలిపోయాడు.

అతడికి అక్రమ సంబంధం ఉంది అంటూ భార్య అనురాధ నిత్యం అనుమానించడంతో అది నిజమో కాదో ప్రపంచానికి తెలియకపోయినా ఆ టార్చర్ ని భరించలేక కునాల్ సింగ్ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కునాల్ కి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

ఉదయ్ కిరణ్

Telugu Vijay Sai, Heroes, Kunalsingh, Pavani, Pradeep Kumar, Tollywood, Uday Kir

చిరంజీవి కూతురుతో బ్రేకప్ అయిన తర్వాత తన కెరియర్ డీలా పడటంతోనే అవకాశాలు లేక కన్నుమూశారు అని బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఉదయ్ కిరణ్ చావుకి మరొక పార్శం కూడా ఉందని అంటారు అతని సన్నిహితులు.సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న ఉదయ్ కిరణ్ తో భార్య విషిత కటువు గా మాట్లాడటంతో తట్టుకోలేకనే ఉరిపోసుకుని చనిపోయాడు అంటున్నారు కొంతమంది.దాంట్లో నిజానిజాలు సంగతి పక్కన పెడితే ఆయన మరణం మాత్రం సినిమా ఇండస్ట్రీకే కాదు అనేకమంది అభిమానులకు ఎంతగానో బాధను మిగిల్చింది.ఉదయ్ కిరణ్ భార్య విషిత ప్రవర్తన కూడా వారి మధ్యలో ఉన్న విభేదాలను స్పష్టంగా తెలియజేసింది.

ఉదయ్ కి సంబంధించిన ఆస్తులు, అతని తల్లికి సంబంధించిన బంగారం అలాగే ప్రాపర్టీస్ తో పాటు విషిత ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది.దీన్ని బట్టి చూస్తే ఉదయ్ మరణం వెనుక ఆమె ఉంది అనే వార్తల్లో నిజం ఉందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

ప్రదీప్ కుమార్

Telugu Vijay Sai, Heroes, Kunalsingh, Pavani, Pradeep Kumar, Tollywood, Uday Kir

ప్రదీప్ కుమార్ తన తోటి సినీ నటి పావని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్ల వరకు వీరి జీవితం బాగానే గడిచింది కానీ వీరి మధ్యలో మూడో వ్యక్తి రావడంతో విభేదాలు మొదలయ్యాయి.తన ఫ్లాట్ లో మరొక వ్యక్తితో తన భార్య పావని ఉండడాన్ని ప్రదీప్ తట్టుకోలేకపోయాడు.క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని కన్ను మూసాడు.దాంతో పావని పట్ల ఇండస్ట్రీలోనే కాదు యావత్ తెలుగు ప్రజలు కూడా ఆమెను ద్వేషించారు.తర్వాత పావని తమిళ ఇండస్ట్రీకి తరలి అక్కడ మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube