సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు, గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారో తెలుసా?

తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి అని చెప్పవచ్చు.సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన రంగు రంగు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల కోలాటం ఇవన్నీ వెంటనే గుర్తు వస్తాయి.

 Why Rangoli Gobbemmalu Do-sankranthi Festivalsankranthi, Rangoli Special, Telugu-TeluguStop.com

సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.అయితే ఎంతో సాంప్రదాయబద్దంగా జరుపుకునే ఈ పండుగకు మాత్రమే రంగు రంగు ముగ్గులను వేసి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే సంక్రాంతి పండుగకు మాత్రమే ముగ్గులు వేసే గొబ్బెమ్మలను పెట్టి ఎందుకు పూజిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

మన తెలుగు సాంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.సాధారణంగా గొబ్బెమ్మలను గోదాదేవిగా, లక్ష్మీ దేవిగా, గౌరీ మాతగా భావించి పూజిస్తారు.సంక్రాంతి పండుగ రోజు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ సమర్పించి, ప్రత్యేక పూలతో అలంకరిస్తారు.అంతేకాకుండా రైతులు పండించిన పంటలు సంక్రాంతికి ఇంటికి చేరడం వల్ల కొత్త ధాన్యాలను కూడా ఆ గొబ్బెమ్మల లో వేసి ధాన్య లక్ష్మి గా కూడా పూజిస్తారు.

ఈ విధంగా గొబ్బెమ్మలను ప్రత్యేకంగా అలంకరించి ఆ ముగ్గులో పెట్టి ఆడపిల్లలు ముగ్గు చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ విధంగా అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.అంతేకాకుండా భర్త ఉన్న స్త్రీలు గొబ్బెమ్మలను పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళిగా వుంటారని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలను పూజించడం ద్వారా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు.

అందుకోసమే ఈ పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ ఈ విధంగా మూడు రోజుల పాటు రంగవల్లులను వేసి గొబ్బెమ్మలను పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube